AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EV- Charging Stations : ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి రైల్వే స్టేషన్లలలో వీరికోసం ఇవి ఏర్పాటు..

EV- Charging Stations : ముంబైలో ఈ-మొబిలిటీని ప్రోత్సహించ‌డానికి ముంబై సెంట్రల్ రైల్వే, యుఎన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం (యుఎన్ఈపి) అలాగే టాటా

EV- Charging Stations : ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి  రైల్వే స్టేషన్లలలో వీరికోసం ఇవి ఏర్పాటు..
uppula Raju
|

Updated on: Feb 19, 2021 | 11:13 AM

Share

EV- Charging Stations : ముంబైలో ఈ-మొబిలిటీని ప్రోత్సహించ‌డానికి ముంబై సెంట్రల్ రైల్వే, యుఎన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం (యుఎన్ఈపి) అలాగే టాటా పవర్ సహకారంతో ఈవీ చార్జింగ్ స్టేష‌న్లను ఏర్పాటు చేయ‌డానిక స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఇందులో భాగంగా ముంబైతోపాటు న‌గ‌ర శివారు ప్రాంతాలు, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లోని అన్ని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఎలక్ట్రికల్ వాహనాల ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయ‌నున్నారు.

మొదటి దశలో సిఎస్‌ఎమ్‌టి (ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్), థానే, దాదర్, పరేల్ మరియు బైకుల్లాతో సహా కీలకమైన రైల్వే స్టేషన్లలో ఎల‌క్ట్రిక్ వెహికిల్స్ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తారు. రెండో దశలో కుర్లా ఎల్‌టిటి (లోక్‌మన్య తిలక్ టెర్మినస్), భండప్, పన్వెల్ మరియు కుర్లాతో సహా తదుపరి స్టేషన్లు ఉంటాయి. పార్కింగ్ సదుపాయం ఉన్న రైల్వే స్టేషన్ల ఎంట్రీ-ఎగ్జిట్ పాయింట్ల వద్ద ఉన్న ప్రాంతాలు ఛార్జింగ్ స్టేషన్ల కోసం కేటాయించారు.ఇటీవలి రవాణా శాఖ గణాంకాల ప్రకారం.. 2017-18లో మహారాష్ట్రలో ఎలక్ట్రికల్ కార్లు, స్కూటర్లు 1,459 ఉండ‌గా అది 2019-20లో 7,400కు పెరిగింది, ఇది చాలా ఆశించ‌ద‌గిన వృద్ధి. ముంబైలో ఈ సంఖ్య 46 నుంచి 672 కు పెరిగింది, ఇది 1,360 శాతం.

ముంబై సెంట్రల్ రైల్వే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రాబిన్ కాలియా మాట్లాడుతూ, “టాటా పవర్ మరియు యుఎన్‌ఈపి భాగస్వామ్యంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సిఎమ్‌టి) వద్ద ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ముంబై డివిజన్ పరిధిలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో EV ఛార్జింగ్ స్టేషన్లను వ్యవస్థాపించడానికి ఈ మోడల్‌ను ఎక్స్‌ట్రాపోలేట్ చేయాలని మేము ప్లాన్ చేస్తున్నామని తెలిపారు.గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను అలాగే వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ -మొబిలిటీని ప్రోత్సహించాల్సిన అవ‌స‌ర‌ముంది. భారతదేశంలో రవాణా రంగం మొత్తం ఇంధన వినియోగంలో 18% వాటా కలిగి ఉంది. సంవత్సరానికి 142 మిలియన్ టన్నుల CO2 ఉద్గారాలు విడుద‌ల‌వుతోంది. ఇందులో 123 మిలియన్ టన్నులు రోడ్డు రవాణా విభాగం ద్వారా విడుద‌ల అవుతోంది.

చర్మం ముడతలు పడుతుందని బాధపడుతున్నారా..? అయితే వారానికి రెండు సార్లు ఇలా చేయండి.. తర్వాత చూసుకోండి..