AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చర్మం ముడతలు పడుతుందని బాధపడుతున్నారా..? అయితే వారానికి రెండు సార్లు ఇలా చేయండి.. తర్వాత చూసుకోండి..

Aging Marks Cover With This Tips: ఆధునిక కాలంలో చాలామంది చర్మం ముడతలు పడుతుందని బాధపడుతుంటారు. నగరాల్లో పొల్యూషన్ పెరిగిపోవడం

చర్మం ముడతలు పడుతుందని బాధపడుతున్నారా..?  అయితే వారానికి రెండు సార్లు ఇలా చేయండి.. తర్వాత చూసుకోండి..
uppula Raju
|

Updated on: Feb 19, 2021 | 10:52 AM

Share

ఆధునిక కాలంలో చాలామంది చర్మం ముడతలు పడుతుందని బాధపడుతుంటారు. నగరాల్లో పొల్యూషన్ పెరిగిపోవడం వల్ల చాలామంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి ఇది చాలా చక్కటి పరిష్కారం. కొంచెం ఓపికగా కింది వాటిని పాటించి వారానికి రెండు సార్లు పాటిస్తే చక్కటి కాంతివంతమైన చర్మాన్ని మళ్లీ దక్కించుకోవచ్చు. బిజీ షెడ్యూల్‌లో కాస్త టైమ్ కేటాయించి ఒకసారి ఇలా చేసి చూడండి.

చింతపండు, పాలు రెండింటిని మిక్సీలో వేసి మెత్తటి గుజ్జులా చేయాలి. ఆ పేస్టును ముఖానికి రాసుకుని కాసేపటి తర్వాత చల్లని నీళ్లతో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం మీది నల్ల మచ్చలు, ముడతలు తొలగిపోతాయి. అంతేకాకుండా పసుపుకొమ్ములను దోరగా వేగించి వాటిని మెత్తగా పొడిచేయాలి. ఆ పొడితో నలుగు పెట్టుకుంటే శరీరం నుంచి వచ్చే దుర్వాసన తగ్గుతుంది. చర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది. షార్ట్ టైమ్‌లో ఆలివ్‌ లేదా బాదం నూనెను ముఖానికి రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం కాంతిమంతంగా మారుతుంది. తులసి ఆకులను బాగా మెత్తగా నూరి, ముఖానికి రాసుకుంటే మచ్చలు, తొలగి పోయి ముఖం తాజాగా కనిపిస్తుంది. స్పూను మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే మిక్సీలో వేసి మెత్తగా పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టులో కాస్త తేనె కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. ఇలా చేస్తే ముఖంలో వయసు పైబడుతున్న ఛాయలు కనిపించవు.

Tips For Black Heads : బ్లాక్ హెడ్స్‌తో ఇబ్బంది పడుతున్నారా.. అయితే తేనె మీకు చక్కటి పరిష్కార మార్గం.. ఎలాగో తెలుసా..