Tips For Black Heads : బ్లాక్ హెడ్స్‌తో ఇబ్బంది పడుతున్నారా.. అయితే తేనె మీకు చక్కటి పరిష్కార మార్గం.. ఎలాగో తెలుసుకోండి..
Tips For Black Heads : చర్మరంధ్రాలు మూసుకుపోవడం, బ్లాక్‌హెడ్స్ వంటివి చర్మ కాంతిని తగ్గిస్తాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు గ్రీన్ టీ, తేనె ఫేస్‌ప్యాక్
Tips For Black Heads : చర్మరంధ్రాలు మూసుకుపోవడం, బ్లాక్‌హెడ్స్ వంటివి చర్మ కాంతిని తగ్గిస్తాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు గ్రీన్ టీ, తేనె ఫేస్‌ప్యాక్ చక్కగా పనిచేస్తుంది అంటున్నారు సౌందర్య నిపుణులు. ఇందుకోసం ఈ విధంగా చేయాలి. ముందుగా ఒక చిన్న గిన్నెలో గ్రీన్ టీ పొడి తీసుకోవాలి. తరువాత అందులో కొద్దిగా తేనే వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ ఫేస్‌ప్యాక్‌ను ముఖానికి నెమ్మదిగా వలయాకారంలో రుద్దుకోవాలి. ఆరిన తరువాత తేలికైన లోషన్ రాసుకోవాలి. ఈ ఫేస్‌ప్యాక్ మృతకణాలను తొలగిస్తుంది. చర్మరంధ్రాలు తెరచుకునేలా చేసి, నిగారింపును తెస్తుంది. ముఖం మీది ఎర్రటి మచ్చలను మాయం చేస్తుంది. సత్వర ఫలితం కోసం ఈ ఫేస్‌మాస్క్ ఎంచుకోవచ్చు.