ఉన్నావ్ జిల్లా ఇద్దరు బాలికల మృతి కేసు : విషప్రయోగం వల్లే చనిపోయారా..? అసలు నిజాలు చెబుతున్న పోలీసులు..

యూపీలోని ఉన్నావ్‌ జిల్లాలో పశువులను మేపడానికి వెళ్లిన ఇద్దరు బాలికలు అనుమానాస్పదంగా మృతిచెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే..

ఉన్నావ్ జిల్లా ఇద్దరు బాలికల మృతి కేసు : విషప్రయోగం వల్లే చనిపోయారా..? అసలు నిజాలు చెబుతున్న పోలీసులు..
Follow us
uppula Raju

|

Updated on: Feb 19, 2021 | 9:41 AM

యూపీలోని ఉన్నావ్‌ జిల్లాలో పశువులను మేపడానికి వెళ్లిన ఇద్దరు బాలికలు అనుమానాస్పదంగా మృతిచెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. ఉన్నావ్‌ గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలు పశువులను మేపడానికి వెళ్లి అదృశ్యమయ్యారు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో ఆందోళనతో వెతుక్కుంటూ వెళ్లిన కుటుంబ సభ్యులకు తమ పిల్లలు చనిపోయి కనిపించారు. షాక్‌కు‌ గురైన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకి చేరుకున్న పోలీసులు చనిపోయిన ఇద్దరి శవాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే దీనిపై పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..

ఆ ఇద్దరు బాలికల శరీరంపై ఎలాంటి గాయాల గుర్తుల్లేవన్నారు. అలాగే వారి మరణానికి కారణాలు కూడా పోస్టుమార్టం నివేదికలో నిర్ధారణ కాలేదని చెప్పారు. మృతి చెందిన బాలికల అవయవాలను రసాయన పరీక్ష కోసం నిల్వ చేసినట్టు చెప్పారు. విషం వల్లే చనిపోయి ఉంటారని వైద్యులు అనుమానిస్తున్నట్టు పేర్కొన్నారు. కాన్పూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న మరో బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు చెప్పారని డీజీపీ తెలిపారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఈ ఘటనపై డీజీపీ నుంచి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కాన్పూర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికకు మంచి వైద్యం అందించాలని సీఎం ఆదేశించినట్టు అధికార ప్రతినిధి తెలిపారు.

Advocates Murder : న్యాయవాదుల హత్య కేసును పోలీసులు ఎలా ఛేదించారో తెలుసా.. అసలు నిజాలు వెలుగులోకి..

పాకిస్తానీ మూలాలున్న బ్రిటిషర్లు రెచ్చిపోతున్నారుః మస్క్
పాకిస్తానీ మూలాలున్న బ్రిటిషర్లు రెచ్చిపోతున్నారుః మస్క్
కాన్‌స్టాస్‌, ట్రావిస్ హెడ్‌లను అరెస్ట్ చేసిన డీఎస్పీ సిరాజ్
కాన్‌స్టాస్‌, ట్రావిస్ హెడ్‌లను అరెస్ట్ చేసిన డీఎస్పీ సిరాజ్
డేంజర్ బెల్స్.. చైనాలో మరో మహమ్మారి.. భారత్ అలర్ట్
డేంజర్ బెల్స్.. చైనాలో మరో మహమ్మారి.. భారత్ అలర్ట్
అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్