Uber: ఉబర్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. భద్రతకు పెద్ద పీట వేస్తూ సరికొత్త ఫీచర్లు..

క్యాబ్ సేవల సంస్థ ఉబర్‌ వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా భారత్‌లో కస్టమర్లను పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ ఉబర్‌ ఈ ఫీచర్లను తీసుకొచ్చింది...

Uber: ఉబర్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. భద్రతకు పెద్ద పీట వేస్తూ సరికొత్త ఫీచర్లు..
Uber Cab
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 01, 2022 | 7:45 AM

క్యాబ్ సేవల సంస్థ ఉబర్‌ వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా భారత్‌లో కస్టమర్లను పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ ఉబర్‌ ఈ ఫీచర్లను తీసుకొచ్చింది. భారత్‌లో ఈ ఫీచర్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణికులు కార్‌లో కూర్చోగానే ముందుగా డ్రైవర్‌ ఫోన్‌ నుంచి ‘సీటు బెల్టు పెట్టుకోండి’ అని వినిపిస్తుంది. ప్రయాణికుడి ఫోన్‌కు సైతం పుష్‌ నోటిఫికేషన్‌ వస్తుంది.

దీంతో పాటు మీరు ప్రయాణిస్తున్న కారు లైవ్‌ లొకేషన్‌ను స్థానిక పోలీసులతో షేర్‌ చేసేందుకు SOS ఫీచర్‌ను కూడా తీసుకొచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సేవలు అందుబాటులోకి రాగా.. త్వరలోనే ఇతర నగరాల్లో ప్రారంభించేందుకు స్థానిక పోలీసులతో ఉబర్‌ చర్చలు జరుపుతోంది. అంతేకాకుండా ప్రయాణికుడికి అత్యవసరంగా ఏదైనా అవసరం ఉన్నప్పుడు కస్టమర్‌కేర్‌తో మాట్లాడే అవకాశం కల్పించారు. ఈ సేవలను 24×7 అందుబాటులో ఉండనున్నాయి. 88006 88666 నంబర్‌కు డయల్‌ చేయడం ద్వారా ఈ సేవలు పొందొచ్చు.

ఈ టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేస్తే కేవలం 30 సెకన్లలోపే కంపెనీ ప్రతినిధి అందుబాటులోకి వస్తారని కంపెనీ తెలిపింది. ఇక నిర్దేశిత రూట్‌లో కాకుండా వేరే మార్గంలో వాహనం వెళ్తుంటే రైడ్ చెక్‌ పేరుతో ప్రయాణికులకు అలర్ట్‌ వెళుతుంది. అంతేకాకుండా నిర్దేశిత సమయానికంటే ఎక్కువ సమయం వాహనం ఆపితే అటు డ్రైవర్‌కు, ఇటు ప్రయాణికుడికి ‘ఎవ్రీథింగ్‌ ఇజ్‌ ఫైన్‌’ అనే ప్రశ్నతో కూడిన నోటిఫికేషన్‌ వెళుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..