Samsung Galaxy S23: 200 మెగా పిక్సెల్స్ కెమెరాతో సామ్‌సంగ్ నుంచి కొత్త ఫోన్.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే..
సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. గెలాక్సీ ఎస్23 సిరీస్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో లాంచ్ చేయనున్నారు. ప్రీమియం స్మార్ట్ ఫోన్‌ల సిరీస్‌లో భాగంగా ఈ ఫోన్‌ను తీసుకొస్తోంది. అమెరికాలో జరిగే సామ్‌సంగ్ అన్‌ప్యాక్డ్ 2023 ఈవెంట్ వేదికగా..
సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. గెలాక్సీ ఎస్23 సిరీస్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో లాంచ్ చేయనున్నారు. ప్రీమియం స్మార్ట్ ఫోన్‌ల సిరీస్‌లో భాగంగా ఈ ఫోన్‌ను తీసుకొస్తోంది. అమెరికాలో జరిగే సామ్‌సంగ్ అన్‌ప్యాక్డ్ 2023 ఈవెంట్ వేదికగా ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ లాంచ్ చేయనుంది.
ఎస్23 సిరీస్‌లో భాగంగా గెలాక్సీ ఎస్23, ఎస్23 ప్లస్, ఎస్23 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయనున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఎస్22, ఎస్21 ఫోన్ల కంటే ధర అధికంగా ఉండనున్నట్లు సమాచారం. సామ్‌సంగ్ ఎస్ 21 ధర రూ. 43 వేల వరకు ఉంది. ఈ లెక్కన కొత్తగా విడుదల కానున్న ఎస్23 ధర రూ. 50వేలకిపైమాటే అని చెబుతున్నారు. అంతేకాకుండా విడిపరికాల ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం కారణంగా కూడా ఫోన్ ధర పెరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్23లో కెమెరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇందులో ఏకంగా 200 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇవ్వనున్నారు. ఈ కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్‌లు స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్‌సెట్‌తో రానున్నాయి. వైఫీ 7, న్యూ 5జీ మోడెమ్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..