AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Digital Payments: మీరు డిజిటల్‌ పేమెంట్‌ యాప్స్‌ నుంచి లావాదేవీలు జరుపుతున్నారా? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి

మార్కెట్లో కొత్త కొత్త యాప్స్‌ పుట్టకొస్తున్నాయి. టెక్నాలజీ పెరుగుతున్న కారణంగా ఆర్థిక లావాదేవీలను సులభతరం అవుతోంది. ఈ నేపథ్యంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా..

Digital Payments: మీరు డిజిటల్‌ పేమెంట్‌ యాప్స్‌ నుంచి లావాదేవీలు జరుపుతున్నారా? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి
Digital Payments
Subhash Goud
|

Updated on: Nov 30, 2022 | 5:59 PM

Share

మార్కెట్లో కొత్త కొత్త యాప్స్‌ పుట్టకొస్తున్నాయి. టెక్నాలజీ పెరుగుతున్న కారణంగా ఆర్థిక లావాదేవీలను సులభతరం అవుతోంది. ఈ నేపథ్యంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)తో కలిసి యూపీఐ డిజిటల్‌ పేమెంట్స్‌ విషయంలో పరిమితులు విధించేందుకు సిద్ధమవుతోంది. గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం లాంటి థర్డ్‌పార్టీ యాప్స్‌ నుంచి యూపీఐ లావాదేవీలు నిర్వహించడం, ఈ యాప్స్‌ నుంచి లావాదేవీలు 30 శాతం మించి రాకూడదన్న నిబంధనలు విధించే అవకాశం కనిపిస్తోంది.

ఇది కనుక అమల్లోకి వచ్చినట్లయితే డిజిటల్‌ లావాదేవీల యాప్స్‌ వాడకంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. నెలకు ఇన్ని లావాదేవీలు మాత్రమే జరిపేందుకు అవకాశం ఉంటుదనే నిబంధనలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో యాప్స్‌ వాడకంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ డిజిటల్‌ యుగంలో మోసాలు పెరిగిపోతున్నాయి. మోసాలు జరుగకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కొత్త కొత్త మార్గాల్లో మోసాలు చేసేందుకు ముఠాలు పుట్టుకొస్తున్నాయి.

యాప్స్‌ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

➦ మొబైల్ పేమెంట్స్‌ యాప్స్‌ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేయడానికి అవతలి వ్యక్తి బ్యాంకు అకౌంట్ల వివరాలు పూర్తిగా తెలిసి ఉండాలి. అవి మన అకౌంట్‌కు లింకై ఉండాలి. అప్పుడే డబ్బులు పంపేందుకు అవకాశం ఉంటుంది. ఇవి అన్ని కూడా ఒక్కఫోన్‌ నెంబర్‌ ఉంటే చాలు ఎవరికైనా డబ్బులు పంపుకొనే వెసులుబాటు ఉంటుంది. ఈ సర్వీసులు అందించే యాప్స్‌ గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం, వాట్సాప్‌ పే లాంటివి ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

➦ యాప్స్‌ ద్వారా చేసే లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో రకరకాల కొత్త యాప్స్‌ పుట్టుకొస్తున్నాయి. వీటిలో ఏవి నమ్మాలో.. ఏవి నమ్మకూడదో తెలియని పరిస్థితి ఉంది.

➦ ముందుగా ప్లేస్టోర్‌ గానీ, యాప్‌ స్టోర్‌లో గానీ ఈ యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే ముందు యాప్‌కు సరైన రేటింగ్స్‌ ఉన్నాయా? రివ్యూస్‌ ఉన్నాయా వాటివి గమనించాలి.

➦ అలాగే యాప్స్‌ లాగి కావడానికి ఎలాంటి నియమాలు ఉన్నాయో గుర్తించాలి. పగడ్బందీగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని గమనించాలి. అలాగే యాప్స్‌కు బలమైన పాస్‌వర్డ్‌ సెట్‌ చేసుకునేందుకు అనుమతి ఉంటుందా? లేదా అనేది గమనించాలి.

➦ ఫోన్‌ ఓపెన్‌ చేసేందుకు ఇచ్చే పాస్‌వర్డ్‌.. యాప్స్‌ ఓపెన్‌ చేసేందుకు మళ్లీ మళ్లీ పాస్‌వర్డ్‌ అడుగుతుందా అనేది చూడాలి.

➦ యాప్‌ నుంచి ఇతరులకు డబ్బులు పంపినా, డబ్బులు వచ్చినా నోటిఫికేషన్స్‌ వస్తున్నాయా? లేదా అనేది గమనించాలి. ఇరులకు పేమెంట్‌ చేసే ముందు కన్‌ఫర్మేషన్‌ అడుగుతుందా? లేదా చూడాలి.

➦ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసే ముందు ఎలాంటి పర్మిషన్లు అడుగుతుంది..? ఇంకా అందులో ఎలాంటి వివరాలు ఉన్నాయో తప్పకుండా గుర్తించాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత