US And China Race For Moon: చంద్రుడి కోసం చైనా – అమెరికా పోరు..! ఈ దశాబ్దంలో చందమామపై తేలిపోదాం..
భూమికి ఉన్న ఏకైక సహజసిద్ధ ఉపగ్రహం చంద్రుడు. మామ కాని మామ చందమామ.. చందమామ రావె.. జాబిల్లా రావె.. అంటూ తల్లులు తమ చిన్నారులకు గోరు ముద్దలు తినిపిస్తుంటారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ప్రజలకు చంద్రుని పట్ల అనేక అపోహలు ఉన్నాయి.
చంద్రుని మీద గ్రహాంతర జీవులు నివాసం ఉంటారని.. అందుకనే మనం అక్కడికి వెళ్లలేకపోతున్నామని నమ్మేవారు కూడా ఉన్నారు. 1820లలో బవేరియన్ అస్ట్రానమర్ ఫ్రాంజ్ వాన్ పౌలా గ్రుయితుయిసెన్ చంద్రుని మీద గ్రహాంతర జీవులు నివాసాలు ఏర్పాటు చేసుకున్నాయని, దాన్ని తాను టెలిస్కోప్‌లో చూశానని చెప్పాడు. మన దేశంతోపాటు అమెరికాలోని కొన్ని ప్రాంతాల వారు, బౌద్ధులు.. చంద్రుని మీద ఒక దైవత్వం ఉన్న కుందేలు నివాసం ఉంటుందని నమ్ముతారు. అయితే ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే. నిజానికి ఇవన్నీ నిరూపితం కాలేదు.ప్రపంచాన్ని శాసిస్తున్న అగ్రదేశం అమెరికాతో ఇప్పుడు చైనా పోటీ పడుతోంది. ఈ రెండు దేశాల మధ్య ఆధిపత్య పోరు ప్రస్తుతం భూ గ్రహం ఆవలకు విస్తరించింది. పరిశోధనల పేరిట ఏకంగా చంద్ర మండలాన్ని సొంతం చేసుకోవాలని అమెరికా, చైనా తహతహలాడుతున్నాయి. తామే ముందు సొంతం చేసుకోవాలని ఆర్టిమిస్-1 పేరిట ఇప్పటికే ప్రాజెక్టును ప్రకటించింది అమెరికా. చంద్రుడిపై నివాసాలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఆర్టిమిస్‌ను చేపట్టినట్టు అగ్రరాజ్యం ప్రకటించింది. దీనికి పోటీగా చైనా రంగంలోకి దిగింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ghost in hospital: అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిన దెయ్యం.. సీసీ కెమెరాలో నమ్మలేని నిజాలు.. వీడియో.
మైనర్ ప్రియుడితో ఎఫైర్..! అత్త గొంతు కోయించిన కిల్లర్ కోడలు
మద్యం మత్తులో మాస్ ఫైట్! బార్ బయట వీరంగం
అధికారం ఉందని అతి చేయకూడదు.. వన్ బై త్రీ కాఫీ ఇవ్వలేదని
ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురికి పిండం పెట్టిన తల్లిదండ్రులు
చదివింది లా.. గురుడు చేసే పని తెలిస్తే షాకే
శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..
ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అద్భుతంగా ఉంది

