Worlds Oldest Cat: ఈ పిల్లి వయసెంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.! ప్రపంచంలోనే అతిపెద్ద వయసున్న పిల్లి..
ఓ పిల్లి ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయసు కలిగిన పిల్లిలా ఏకంగా గిన్నిస్ రికార్డులకెక్కింది. సాధారణంగా పిల్లుల జీవితకాలం 13 నుంచి 18 ఏళ్లు జీవిస్తాయి. కానీ, ఈ పిల్లి మాత్రం జీవితకాలం దాటినా ఇంకా బతికే ఉంది.
ఓ పిల్లి ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయసు కలిగిన పిల్లిలా ఏకంగా గిన్నిస్ రికార్డులకెక్కింది. సాధారణంగా పిల్లుల జీవితకాలం 13 నుంచి 18 ఏళ్లు జీవిస్తాయి. కానీ, ఈ పిల్లి మాత్రం జీవితకాలం దాటినా ఇంకా బతికే ఉంది. ప్రస్తుతం ఈ పిల్లి వయసు 26 ఏళ్లు. దాంతో, ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయసున్న పిల్లిగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. 26 ఏళ్ల 329 రోజుల వయసు ఉన్న ఈ పిల్లి మరికొద్ది రోజుల్లో 27వ పుట్టిన రోజు జరుపుకోనుంది. ఒక పిల్లి 27 ఏళ్లు బతకడం అనేది దాదాపు మనిషి 120 ఏళ్లు బతికిన కాలంతో సమానం అంటున్నారు వెటర్నరీ డాక్టర్లు. గిన్నిస్ రికార్డు సాధించిన ఈ పిల్లి పేరు ఫ్లోసీ. ఈ పిల్లి ఫొటోల్ని గిన్నిస్ సంస్థ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. దాంతో, ఫ్లోసీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఫ్లోసీని ప్రస్తుతం బ్రిటన్‌కు చెందిన విక్కీ గ్రీన్ అనే వ్యక్తి పెంచుకుంటున్నాడు. ఫ్లోసీ 26 ఏళ్ల వయసులోనూ పూర్తి ఆరోగ్యంగా ఉందని, ఎంతో చలాకీగా ఉంటుందని, చక్కగా ఆడుకుంటుందని విక్కీ తెలిపాడు. కాకపోతే చూపు, వినికిడి శక్తి తగ్గాయని చెప్పాడు. ఇంతకుముందు ఈ రికార్డు అమెరికాకు చెందిన టిఫానీ టూ అనే పిల్లి పేరు మీద ఉండేది. 1995లో మెర్‌సెయ్‌సైడ్ ఆస్పత్రి పరిసరాల్లో కనిపించిన ఫ్లోసీను ఒక వర్కర్ పెంచుకునేందుకు ఇంటికి తీసుకెళ్లాడు. పదేళ్ల తర్వాత అతను చనిపోవడంతో అతని చెల్లెలు ఫ్లోసి బాధ్యత తీసుకుంది. అలా ఇప్పటివరకూ చాలామంది యజమానుల దగ్గర ఈ పిల్లి పెరిగింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ghost in hospital: అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిన దెయ్యం.. సీసీ కెమెరాలో నమ్మలేని నిజాలు.. వీడియో.