Snake – Dog: బండరాయి మాటున పిల్లలకు పాలిస్తున్న వీధి కుక్క.. అంతలో అక్కడికి వచ్చిన భారీ పాము..
వికారాబాద్ జిల్లాలోని మంతటి గ్రామంలో స్థానికంగా ఉండే ఓ వీధి కుక్క ఇటీవల మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఓ బండ చాటున ఆవాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తోంది. ఇంతలో అక్కడికి వచ్చిన నాగుపాము ఆ కుక్క పిల్లలపై దాడి చేసింది.
వికారాబాద్ జిల్లాలోని మంతటి గ్రామంలో స్థానికంగా ఉండే ఓ వీధి కుక్క ఇటీవల మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఓ బండ చాటున ఆవాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తోంది. ఇంతలో అక్కడికి వచ్చిన నాగుపాము ఆ కుక్క పిల్లలపై దాడి చేసింది. ఆ పక్కనే ఉన్న తల్లి కుక్క.. పాముతో పోరాడింది. తన పిల్లలను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ, దాని ప్రయత్న విఫలయత్నంగా మిగిలిపోయింది. పాము కాటుకు మూడు కుక్క పిల్లలు బలైపోయాయి. పాము విషం ధాటికి విలవిల్లాడుతూ మూడు పిల్లలు ప్రాణాలు కోల్పోయాయి. ఇక్కడ మరో దారుణమైన విషయం ఏంటంటే.. పక్కనే ఉన్న కొందరు వ్యక్తులు పాము నుంచి ఆ కుక్క పిల్లలను రక్షించే ప్రయత్నం చేయకపోవడమే. అవును.. పాము వచ్చి ఆ కుక్క పిల్లలపై దాడి చేస్తుంటే కొందరు వ్యక్తులు తమ ఫోన్లలో వీడియో చిత్రీకరించారు. మూడు కుక్క పిల్లలను చంపేంత వరకు అలాగే వీడియో తీసిన స్థానికులు.. ఆ తరువాత పాముపై దాడి చేసి చంపేశారు. కుక్క పిల్లలపై పాము అటాక్ చేయడానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆ వీడియో తీసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. స్థానికుల తీరుపై మండిపడుతున్నారు. మూగజీవిపై కనీస మానవత్వం కూడా చూపలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ghost in hospital: అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిన దెయ్యం.. సీసీ కెమెరాలో నమ్మలేని నిజాలు.. వీడియో.
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

