ఎలక్ట్రిక్‌ వాహనం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. కేవలం రూ.35 వేలకే స్కూటర్‌ను దక్కించుకోండి

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో చాలా మంది వాహనదారులు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు ఆసక్తి చూపుతున్నారు. అందుకు తగినట్లుగానే పలు వాహనాల కంపెనీలు సైతం తక్కువ ధరల్లో..

ఎలక్ట్రిక్‌ వాహనం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. కేవలం రూ.35 వేలకే స్కూటర్‌ను దక్కించుకోండి
Nausha Electric Scooter
Follow us
Subhash Goud

|

Updated on: Nov 29, 2022 | 6:04 PM

Nausha Electric Scooter: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో చాలా మంది వాహనదారులు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు ఆసక్తి చూపుతున్నారు. అందుకు తగినట్లుగానే పలు వాహనాల కంపెనీలు సైతం తక్కువ ధరల్లో రకరకాల ఎలక్ట్రిక్‌ వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఎలక్ట్రిక్‌ స్కూటర్లను అందుబాటులోకి తీసుకురాగా, వాహనదారులు సైతం వాటి వైపే ఆసక్తి చూపుతున్నారు. అయితే మీరు తక్కువ ధరల్లో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొనుగోలు చేయాలని భావిస్తుంటే మంచి ఆప్షన్‌ అందుబాటులో ఉంది. కేవలం రూ.35 వేలకే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను కొనుగోలు చేసేలా కంపెనీ తయారు చేసింది. నేపథ్యంలో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్‌ విభాగంలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. ఇటీవల పంజాబ్ కు చెందిన  నౌషా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొత్త ఈవీని రూపొందించింది. దీని ధర కేవలం రూ.35 వేలు మాత్రమే. తక్కువ ధరల్లో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి ఆప్షన్‌ అనే చెప్పాలి.

స్కూటర్‌లో బోర్‌వెల్‌ మోటారు:

కాగా, ఈ స్కూటర్‌ తయారీలో వ్యవసాయ బోర్లలో ఉపయోగించే సబ్‌మెర్సిబుల్ బోర్‌వెల్ మోటారును ఉపయోగించారు. పైన భాగాన్ని తీసేసి లోపలి భాగాన్ని ఈ స్కూటర్‌కు వాడారు. హబ్ మోటార్, బ్యాటరీ, కంట్రోలర్ వంటివి కూడా ఇతర ఈవీల నుంచి తీసుకున్నారు. తాము ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పూర్తిగా స్క్రాప్ మెటీరియల్స్‌తో తయారు చేశానని, వీటిని గతంలో వాడేందుకు అనర్హమైనదిగా భావించినట్లు నౌషా పేర్కొంది. అయితే కొన్ని స్క్రాప్ మెటీరియల్‌ని ఎంపిక చేసి ఈ స్కూటర్‌కు ఉపయోగించినట్లు నౌషా తెలిపింది.

విడి భాగాల దిగుమతితో స్కూటర్ తయారీ

అయితే నౌషా ఎలక్ట్రిక్‌ స్కూటర్ అనేది కంపెనీ కాదు. ఈవీ వాహనాలకు సంబంధించి విడి భాగాలను దిగుమతి చేసుకుని స్కూటర్‌ను తయారు చేస్తుంది. అయితే ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ తయారు చేయడానికి మొదట రూ.40 వేల వరకు ఖర్చు అయిందట. తర్వాత దీనిని రూ.35కే తయారు చేశారు. దేశ వ్యాప్తంగానే కాకుండా విదేశాల నుంచి కూడా ఈ స్కూటర్‌కు ఆర్డర్లు వచ్చాయని తయారీదారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వాహనం కొనుగోలు చేసేందుకు అందుబాటులో లేకపోయినా.. త్వరలో అమ్మకాలు ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.

ఇవి కూడా చదవండి

బ్లాక్‌, ఎల్లో రంగుల్లో..

ఈ స్కూటర్‌ బ్లాక్‌, ఎల్లో రంగుల్లో లభించనున్నాయి. ఎల్లో రంగు వాహనం ముందు భాగంలో డ్రమ్‌ బ్రేక్స్‌ ఉండగా, బ్లాక్‌ వేరియంట్‌లో ఉండవని తెలుస్తోంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి