WhatsApp: వాట్సాప్‌లో మీ డేటా భద్రంగా ఉండాలంటే.. సెట్టింగ్స్‌లో ఈ మార్పులు చేసుకోవాల్సిందే..

వాట్సాప్‌ ప్రతీ ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లో కచ్చితంగా ఈ యాప్‌ ఉండాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న మెసేజింగ్ యాప్‌గా వాట్సాప్‌కు గుర్తింపు ఉంది. అయితే తాజాగా వాట్సాప్‌ నుంచి భారీగా డేటా లీక్‌ అయ్యిందన్న వార్తలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి...

WhatsApp: వాట్సాప్‌లో మీ డేటా భద్రంగా ఉండాలంటే.. సెట్టింగ్స్‌లో ఈ మార్పులు చేసుకోవాల్సిందే..
Whatsapp Settings
Follow us

|

Updated on: Nov 30, 2022 | 1:39 PM

వాట్సాప్‌ ప్రతీ ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లో కచ్చితంగా ఈ యాప్‌ ఉండాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న మెసేజింగ్ యాప్‌గా వాట్సాప్‌కు గుర్తింపు ఉంది. అయితే తాజాగా వాట్సాప్‌ నుంచి భారీగా డేటా లీక్‌ అయ్యిందన్న వార్తలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. 50 కోట్ల మంది వాట్సాప్‌ యూజర్ల ఫోన్‌ నంబర్లు ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉంచినట్లు వార్తలు రావడంతో యూజర్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ వ్యవహారంతో వాట్సాప్‌ సెక్యూరిటీ ప్రశ్నార్థకంగా మారింది. అయితే వాట్సాప్‌ మనకు అందించిన కొన్ని సెక్యూరిటీ ఫీచర్ల సహాయంతో మన డేటాను భద్రంగా ఉంచుకోవచ్చు. మీ వాట్సాప్‌ ఖాతా మరింత సెక్యూర్‌గా మారాలంటే ఈ విషయాలను గుర్తు పెట్టుకోండి..

* ఎన్‌క్రిప్షన్‌ ఆన్‌లో ఉందో లేదో ఒటికి రెండు సార్లు చెక్‌ చేసుకోండి. వాట్సాప్‌ సహజంగా ఎక్‌క్రిప్షన్‌ను దానంతటనే అతే ఎనేబుల్‌ చేస్తుంది. అయితే ఒకసారి స్వయంగా చెక్‌ చేసుకోవాలి. ఇందుకోసం మీరు మెసేజ్‌ వారికి నెంబర్‌పై క్లిక్‌ చేసి ఎన్‌క్రిప్షన్ ఆప్షన్‌పై టాప్‌ చేస్తే సరి.

* డేటా భద్రంగా ఉండడానికి వాట్సాప్‌ అందించిన మరో సెక్యూరిటీ ఫీచర్‌ ‘టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్’. దీనిద్వారా మీరు ఎదుటి వ్యక్తితో చేస్తున్న సంభాషణను ఎవరూ చూడలేరు. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవడానికి ముందుగా మెనులోకి వెళ్లాలి అనంతరం సెట్టింగ్స్‌పై క్లిక్‌ చేసి అకౌంట్‌ సెక్షన్‌లోకి వెళ్లాలి. అనంతరం టూ స్టెప్ వెరిఫికేషన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

* సెక్యూరిటీ నోటిఫికేషన్‌ను ఆన్‌ చేసుకోవడం ద్వారా కొత్త డివైజ్‌లోకి వాట్సాప్‌ ఓపెన్‌ చేయగానే సెక్యూరిటీ కోడ్‌ జనరేట్ అవుతుంది. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవడానికి ముందుగా వాట్సాప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అనంతరం సెట్టింగ్‌ ఓపెన్‌ చేసి.. సెక్యూరిటీ నోటిఫికేషన్స్‌పై క్లిక్‌ చేసి ‘షో సెక్యూరిటీ నోటిఫికేషన్‌’ను ఎంచుకోవాలి.

* వాట్సాప్‌ సెక్యూరిటీని పెంచుకునేందుకు క్లౌడ్‌ బ్యాకప్స్‌ను కూడా ఎన్‌క్రిప్ట్‌ చేసుకోవాలి. దీనివల్ల క్లౌడ్‌లో స్టోర్‌ అయిన డేటాను కూడా ఎవరూ యాక్సెస్‌ చేయలేరు. ఈ ఫీచర్‌ను ఆన్‌ చేయాలంటే.. సెట్టింగ్స్‌లోకి చాట్స్‌ను ఓపెన్‌ చేయాలి. అనంతరం చాట్‌ బ్యాకప్‌పై క్లిక్‌ చేసి ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్టెడ్‌ బ్యాకప్‌పై ట్యాప్‌చేసి టర్నన్‌ ఆన్‌ను నొక్కితో సరి. ఇందుకోసం ఓ పాస్‌వర్డ్‌ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

* ఇక అన్నింటికంటే ముఖ్యమైన విషయం తెలియని వెబ్‌సైట్‌లను ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్‌ చేయకూడదు. ఏమాత్రం అనుమానం అనిపించినా సదరు లింక్‌ల జోలికి వెళ్లకూడదు. కొందరు సైబర్‌ నేరగాళ్లు ఈ లింక్‌లతోయూజర్ల డేటాను కాజేస్తున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..