Xiaomi 13: షావోమి నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. 13 సిరీస్ మార్కెట్లోకి వచ్చేది ఆ రోజే.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే..
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తోంది. షావోమి 12 సిరీస్‌కు సీక్వెల్‌గా 13 సిరీస్‌ను లాంచ్ చేస్తోంది. డిసెంబర్ 1వ తేదీన ఈ ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది...
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తోంది. షావోమి 12 సిరీస్‌కు సీక్వెల్‌గా 13 సిరీస్‌ను లాంచ్ చేస్తోంది. డిసెంబర్ 1వ తేదీన ఈ ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ ఫోన్‌కు సంబంధించిన షావోమి ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ ఆన్‌లైన్‌లో కొన్ని ఫీచర్లు లీక్ అయ్యాయి. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత ఉండే అవకాశం ఉంది లాంటి పూర్తి వివరాలు మీకోసం..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ను అందించనున్నట్లు సమాచారం. ప్రీమియం సిరీస్‌లో భాగంగా ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు. ఈ ఫోన్‌ను ప్రొ కర్వ్డ్ డిస్‌ప్లేను అందించనున్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ ఫోన్‌లో ఎంఐయూఐ 14ను అందించనున్నారని సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యేకంగా ఐపీ68 రేటింగ్‌తో వాటర్, డస్ట్ ప్రూఫ్‌గా అందివ్వనున్నారు.
డిస్‌ప్లే విషయానికొస్తే ఇందులో ప్రొ మోడల్ 6.65 ఇంచ్ 2కే రిజల్యూషన్ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే ధర విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. షావోమి తాజాగా విడుదల చేసిన 12ప్రొ ధర రూ. 63,000 ఉండగా 13 అంతకంటే ఎక్కువ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డిసెంబర్ 1వ తేదీన రాత్రి 7 గంటలకు షావోమి 13 సిరీస్‌ను విడుదల చేయనున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..