WhatsApp: వాట్సప్‌లో సరికొత్త ఫీచర్.. ఇక నుంచి మీకు మీరే మెసేజ్‌లు పంపుకునే వెసులుబాటు.. ఇదేలా పనిచేస్తుందంటే..
వాట్సప్ వినియోగం రోజురోజుకు పెరుగుతుంది. మెసెజింగ్ సేవలతో పాటు వీడియో, ఆడియో కాల్స్ సేవలు అందిస్తుండటంతో వాట్సప్ వినియోగదారులకు సంఖ్య పెరుగుతోంది. దాదాపు ఆండ్రాయిడ్ ఫోన్ వాడే చాలామంది ఈ యాప్ వినియోగిస్తున్నారు. దీంతో ఇటీవల కాలంలో..
వాట్సప్ వినియోగం రోజురోజుకు పెరుగుతుంది. మెసెజింగ్ సేవలతో పాటు వీడియో, ఆడియో కాల్స్ సేవలు అందిస్తుండటంతో వాట్సప్ వినియోగదారులకు సంఖ్య పెరుగుతోంది. దాదాపు ఆండ్రాయిడ్ ఫోన్ వాడే చాలామంది ఈ యాప్ వినియోగిస్తున్నారు. దీంతో ఇటీవల కాలంలో వాట్సప్ తన వినియోగదారుల కోసం అనేక రకాల కొత్త ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొస్తుంది. తమ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా తాను అందించే సేవలకు మరిన్ని మెరుగులు దిద్దుతూ వస్తున్న విషయం తెలిసిందే. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా వాట్సప్ తన సేవలను అప్‌డేట్ చేసుకుంటూ ముందుకెళ్తోంది. తాజాగా మెసేజింగ్ యాప్ వాట్సాప్‍కు కొత్త ఫీచర్ యాడ్ అవుతోంది. మెసేజ్ యువర్ సెల్ఫ్ ఫీచర్‌ను భారత్‌లోని వినియోగదారుల కోసం లాంచ్ చేస్తున్నట్టు వాట్సాప్ ప్రకటించింది. కొంతకాలంగా వాట్సాప్ ఈ ఫీచర్ ను టెస్ట్ చేస్తోందనే ప్రచారం జరగ్గా, ప్రస్తుతం ఆ సేవలను అందిచనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వాట్సాప్‍కు మెసేజ్ యువర్ సెల్ఫ్ ఫీచర్ వచ్చేస్తోందని మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ప్రకటించారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లందరికీ కొన్ని వారాల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుందని తెలిపారు.
ఈ మెసేజ్ యువర్ సెల్ఫ్ ఫీచర్ అందుబాటులోకి వస్తే మీ నంబర్‌కు మీరే వాట్సాప్ మెసేజ్ సెండ్ చేసుకోవచ్చు. నోట్స్, రిమైండర్స్, షాపింగ్ లిస్ట్ లను రాసుకోవడంతో పాటు ముఖ్యమైన టెక్స్ట్ ను సేవ్ చేసుకునేందుకు ఈ వాట్సాప్ మెసేజ్ యువర్ సెల్ఫ్ ఫీచర్ ఉపయోగపడనుంది. మీరు సేవ్ చేసుకోవాలనుకున్న వాటిని వాట్సాప్ ద్వారా మీ నంబర్ కు మీరే సెండ్ చేసుకోవచ్చు. దీంతో చాట్‍లో అవి స్టోర్ అయి ఉంటాయి.
మేసెజ్ యువర్ సెల్ఫ్ ను ఉపయోగించేందుకు ముందుగా వాట్సాప్ కాంటాక్ట్ లిస్ట్ లోకి వెళ్లాలి. అన్ని కాంటాక్ట్ ల కంటే టాప్‍లో మీ నంబర్ కనిపిస్తుంది. బ్రాకెట్‍లో సెల్ఫ్ అని ఉంటుంది. ఆ నంబర్ పై క్లిక్ చేసి.. మీకు మీరే మెసేజ్‍లు సెండ్ చేసుకోవచ్చు. దీంతో చాట్స్ లో మీ నంబర్ కూడా కనిపిస్తుంది. కొన్ని వారాల్లోనే ఈ ఫీచర్ యూజర్లందరికీ అందుబాటులోకి రానుందని సంస్థ వెల్లడించింది. వాట్సాప్‍లో కమ్యూనిటీస్ ఫీచర్ ఇటీవలే అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో వేర్వేరు గ్రూప్‍లను ఒకే కమ్యూనిటీలో యాడ్ చేసుకునే వెసులుబాటు కలిగింది. గ్రూప్‍లో 1024 మంది యూజర్ల వరకు ఉండేలా లిమిట్‍ను పెంచింది వాట్సాప్. వీడియో కాల్‍లోనూ ఒకేసారి 32 మంది పార్పిసిపెంట్లు పాల్గొనేలా ఫీచర్ ను లాంచ్ చేసింది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం చూడండి..