AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp: వాట్సాప్‌లో వచ్చిన ఈ కొత్త ఫీచర్‌ను గమనించారా.? మీకు మీరు మెసేజ్‌ పంపుకునే ఛాన్స్‌..

నిత్యం ఏదో ఒక అప్‌డేట్‌తో యూజర్లను పెంచుకుంటూ పోతోంది మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న ఏకైక యాప్‌గా వాట్సాప్‌ ప్రసిద్ధి చెందింది. ఈ యాప్‌కు ఎంతటి క్రేజ్‌ ఉందంటే స్మార్ట్ ఫోన్‌ ఉన్న..

Whatsapp: వాట్సాప్‌లో వచ్చిన ఈ కొత్త ఫీచర్‌ను గమనించారా.? మీకు మీరు మెసేజ్‌ పంపుకునే ఛాన్స్‌..
Whatsapp
Narender Vaitla
|

Updated on: Nov 29, 2022 | 10:31 AM

Share

నిత్యం ఏదో ఒక అప్‌డేట్‌తో యూజర్లను పెంచుకుంటూ పోతోంది మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న ఏకైక యాప్‌గా వాట్సాప్‌ ప్రసిద్ధి చెందింది. ఈ యాప్‌కు ఎంతటి క్రేజ్‌ ఉందంటే స్మార్ట్ ఫోన్‌ ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేంత. ఇక యూజర్ల ప్రైవసీ పెద్ద పీట వేస్తూ గత కొన్ని రోజులుగా వరుసగా ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోన్న వాట్సాప్‌.. తాజాగా మరో ఆసక్తికర ఫీచర్‌ను తీసుకొచ్చింది. నిజానికి ఈ ఫీచర్‌ ఇప్పటికే వచ్చేసింది కూడా. మెసేజ్‌ యూవర్‌సెల్ఫ్‌ పేరుతో వాట్సాప్‌ ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ఈ ఫీచర్‌ ఉపయోగమెంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలకి వెళ్లాల్సిందే.

ఉదాహరణకు మీరు గూగుల్‌లో ఏదో బ్రౌజ్‌ చేస్తున్నారు. అందులో మీకు ఓ ఆసక్తికరమైన కథనం కనిపించింది. దానిని సేవ్‌ చేయాలనుకుంటే ఏం చేస్తారు. సదరు లింక్‌ను మీకు తెలిసిన వారి వాట్సాప్‌ చాట్‌కు పంపించుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇది ఎదుటి వారికి ఇబ్బందిగా అనుపిస్తుండొచ్చు. అలా కాకుండా మీ నెంబర్‌కే మీరు మెసేజ్‌ పంపించుకునే వెసులుబాటు ఉంటే ఎలా ఉంటుంది.? అచ్చంగా ఈ ఆలోచనతో వాట్సాప్‌ ఈ మెసేజ్‌ యూవర్‌సెల్ఫ్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో తమ వాట్సాప్‌ అకౌంట్‌ నుంచి తమకే మెసేజ్‌లు పంపొచ్చు.

Message Yourself

ఇవి కూడా చదవండి

ఈ ఫీచర్‌ సహాయంతో యూజర్లు రిమైండర్స్‌ ప్లాన్‌, షాపింగ్‌ లిస్ట్‌, నోట్స్‌ ప్రిపరేషన్‌ వంటి వాటి కోసం మరే ఇతర యాప్స్‌ను ఉపయోగించకుండా వాట్సాప్‌లోనే సేవ్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ కొద్ది మంది ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఈ వారంలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుందని వాట్సాప్‌ తెలిపింది. ఇక మీ నెంబర్‌కు మెసేజ్‌ పంపాలంటే చాట్‌ బాక్స్‌ ఓపెన్‌ చేసి.. మీ నెంబర్‌ను సెర్చ్‌ చేయాలి. వెంటనే.. మీ ఫోన్‌ నెంబర్‌తో పాటు బ్రాకెట్‌లో యూ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి మీకు మీరు మెసేజ్‌ చేసుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..