Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: వాట్సప్‌లో అదిరిపోయే ఈ ఫీచర్లను మీరు వాడుతున్నారా.. ఓసారి చెక్‌ చేసుకోండి..

WhatsApp New features: ఆండ్రాయిడ్‌ ఫోన్ల వాడుతున్నవారిలో చాలామంది వాట్సప్‌ను వాడుతుంటారు. కేవలం మెసేజ్‌లే కాకుండా.. ఫోటోలు, వీడియోలు, ఇతర డాక్యుమెంట్లను సైతం షేర్‌ చేసుకునే వీలుండటంతో

WhatsApp: వాట్సప్‌లో అదిరిపోయే ఈ ఫీచర్లను మీరు వాడుతున్నారా.. ఓసారి చెక్‌ చేసుకోండి..
Whatsapp
Follow us
Amarnadh Daneti

|

Updated on: Jan 01, 2023 | 9:41 AM

WhatsApp New features: ఆండ్రాయిడ్‌ ఫోన్ల వాడుతున్నవారిలో చాలామంది వాట్సప్‌ను వాడుతుంటారు. కేవలం మెసేజ్‌లే కాకుండా.. ఫోటోలు, వీడియోలు, ఇతర డాక్యుమెంట్లను సైతం షేర్‌ చేసుకునే వీలుండటంతో వాట్సప్‌ వినియోగం విస్తృతమైంది. అలాగే వాట్సప్‌ వినియోగదారులను ఆకర్షించడం కోసం సంస్థ ఎప్పటికప్పుడు న్యూ ఫీచర్లను పరిచయం చేస్తోంది. గత ఏడాది ఎన్నో కొత్త ఫీచర్లను వాట్సప్‌ ప్రవేశపెట్టింది. వాటిలో ముఖ్యమైనవి ఎమోజీతో రిప్లే ఇవ్వడం, వాట్సప్‌లో కమ్యూనిటీ గ్రూపులు ఏర్పాటుచేసుకోవడం, ఆన్‌లైన్‌లో ఉన్నట్లు తెలియకుండానే చాట్‌ చేయడం వంటివి ఎంతో ముఖ్యమైనవి. ఈ ఫీచర్లను మీరు ఉపయోగిస్తున్నారో లేదో తెలుసుకోండి. ఈ కొత్త వాట్సప్‌ ఫీచర్లు ఎలా ఉపయోగపడతాయి. వీటి వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం. వాస్తవానికి వాట్సప్‌ దాదాపు పదికి పైగా మార్పులను చేస్తూ.. అనేక కొత్త ఫీచర్లను కస్టమర్ల కోసం తీసుకొచ్చింది. వాట్సప్‌ వినియోగదారుడికి అవతలి వ్యక్తి ఏదైనా సందేశం పంపినప్పుడు ఎమోజీలతో వాటికి మన స్పందన తెలియజేయవచ్చు. అయితే మనకు వచ్చిన సందేశాన్ని సెలక్ట్‌ చేస్తే.. ఎమోజీతో స్పందించేందుకు కేవలం ఆరు మాత్రమే కనిపిస్తాయి. చాలా మంది ఈ ఆరింటిలో ఒకటి మాత్రమే పంపించగలమా అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. కాని ఆరు చిహ్నాలే కాకుండా దాని పక్కన ఉన్న ప్లస్‌ బటన్ నొక్కడం ద్వారా మరిన్ని ఎక్కువ, సందర్భాన్ని బట్టి అవసరమైన ఎమోజీ ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. వాట్సప్‌లో వచ్చిన మార్పులో ఇదొకటి.. మీరు ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోలేకపోయినట్లయితే.. వెంటనే ఈ సౌలభ్యాన్ని వినియోగించుకోండి.

కమ్యూనిటీ గ్రూపులు

వాట్సప్‌లో కమ్యూనిటీ గ్రూపులను ఏర్పాటుచేసుకునే వెసులుబాటు కల్పిస్తూ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. సాధారణంగా ప్రతి వాట్సప్ వినియోగదారుడు కమ్యూనిటీ గ్రూపులను క్రియేట్ చేయవచ్చు. ఉదాహరణకు ఒక అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నవారంతా కలిసి ఒక సమూహం గ్రూప్ ఏర్పాటుచేసుకుని.. ఒకేసారి సమాచారాన్ని అందరితో షేర్‌ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో ఉన్నట్లు తెలియకుండానే చాటింగ్‌

సాధారణంగా ఎవరైనా వాట్సప్‌ను ఉపయోగిస్తున్న సమయంలో ఆ వ్యక్తి ఆన్‌లైన్‌లో ఉన్నట్లు చూపిస్తుంది. కాని ఆన్‌లైన్‌లో ఉన్నా.. ఉన్నట్లు తెలియకుండా చాట్ చేసుకునే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది సంస్థ. ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే సెట్టింగ్స్‌లో ఆప్షన్‌లలో మార్పు చేసుకుంటే సరిపోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం చూడండి..