WhatsApp: మెసేజ్‌లతో వాట్సప్‌ నిండిపోతుందా.. ఈ సింపుల్ ట్రిక్‌తో స్టోరేజి సమస్యకు పులిస్టాప్ పెట్టండి..

WhatsApp: ఫోన్‌లో వాట్సప్‌ వాడుతున్నవారు ముఖ్యంగా స్టోరేజ్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రతి రోజూ వచ్చే మెసెజ్‌లతో స్టోరేజ్ త్వరగా ఫుల్ అయిపోతుంది. మరోవైపు వచ్చిన మెసేజ్‌లను డిలీట్‌ చేయడం..

WhatsApp: మెసేజ్‌లతో వాట్సప్‌ నిండిపోతుందా.. ఈ సింపుల్ ట్రిక్‌తో స్టోరేజి సమస్యకు పులిస్టాప్ పెట్టండి..
Whatsapp
Follow us
Amarnadh Daneti

|

Updated on: Jan 01, 2023 | 12:13 PM

WhatsApp: ఫోన్‌లో వాట్సప్‌ వాడుతున్నవారు ముఖ్యంగా స్టోరేజ్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రతి రోజూ వచ్చే మెసెజ్‌లతో స్టోరేజ్ త్వరగా ఫుల్ అయిపోతుంది. మరోవైపు వచ్చిన మెసేజ్‌లను డిలీట్‌ చేయడం కూడా కొన్ని సందర్భాల్లో కష్టం అవుతుంది. మొత్తం డిలీట్ చేద్దాం ఒకేసారి అంటే.. ముఖ్యమైన సందేశాలు ఉంటే అవి కూడా డిలీట్‌ అయిపోతాయి. అందుకే చాలామంది మెసేజ్‌లు డిలీట్‌ చేయకుండా ఉంచుతారు. దీంతో కొద్ది రోజులకే స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది. మరి ఇలాంటి సమయంలో మెసేజ్‌లు డిలీట్ చేయకపోయినా.. స్టోరేజీని క్లియర్‌ చేసుకునే ఒక ఫీచర్‌ అందుబాటులో ఉంది. అవతలి వ్యక్తి నుంచి వచ్చే చాటింగ్‌లో సందేశాలు, ఫోటోలు, వీడియోలు, GIFలు, వాయిస్ సందేశాలు, స్టిక్కర్లు వంటి వాటిని వేటికి అవే తొలగించవచ్చు. వినియోగదారుడు వేటిని ఉంచాలనుకుంటున్నారు.. వేటిని అవసరం లేదనుకుంటున్నారో ఎంచుకోవచ్చు.

iOS, Android వినియోగదారులకు ప్రక్రియ ఒకే విధంగా ఉంటుంది. మొదట సెట్టింగ్‌ అనే ఆప్షన్‌ ఎంచుకుని.. స్టోరేజీ అండ్ డేటా ఆప్షన్ క్లిక్ చేసి మేనేజ్ స్టోరేజ్ ను ఎంచుకోవాలి. ఆ తర్వాత మీరు ఫోన్‌లో అవసరం లేదనుకుంటున్న వాటి పక్కన ఉన్న సంబంధిత బాక్స్‌లను టిక్ చేయండి.

ఆ తర్వాత డిలీట్ సింబల్‌ పై నొక్కితే మీరు ఎంచుకున్నవి ఒకేసారి డిలీట్ అయిపోతాయి. అలాగే 5MB కంటే ఎక్కువ ఉన్న ఫైల్ లేదా ఇమేజ్, వీడియోలు ఎన్ని ఉన్నాయి. ఒకే ఐటమ్‌ ఎన్నిసార్లు ఫార్వార్డ్ చేశారో కూడా తెలుసుకునే వెసులుబాటు ఉంది. దాని కోసం సెట్టింగ్‌ ఆప్షన్‌లోకి వెళ్లి.. డేటా అండ్ స్టోరేజి క్లిక్ చేసి స్టోరేజ్ ఆప్షన్ ఎంచుకుంటే 5MB కంటే ఎక్కువ స్పేస్‌ ఉన్న లేదా ఫార్వార్డ్ చేయబడిన ఐటమ్స్‌ కనిపిస్తాయి. వీటిలో ఏది తీసేయాలనుకుంటే వాటిని తొలగించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం చూడండి..