AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyundai Creta Cars: 8 లక్షల రూపాయలకే అందుబాటులో ఉన్న హ్యుందాయ్ క్రెటా కార్లు.. పూర్తి వివరాలివే..

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటాకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఉన్న మారుతి వితారా బ్రెజా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, రెనో డస్టర్, టాటా నెక్సాన్, మహీంద్రా..

Hyundai Creta Cars: 8 లక్షల రూపాయలకే అందుబాటులో ఉన్న హ్యుందాయ్ క్రెటా కార్లు.. పూర్తి వివరాలివే..
Second Hand Cars Of Hyundai Creta
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 31, 2022 | 9:23 PM

తక్కువ ధరకు లేదా అందుబాటు ధరకే కారును కొనాలనుకునేవారి కోసం 24కార్స్ వెబ్‌సైట్‌లో కొన్ని హ్యుందాయ్ క్రెటా కార్లు అమ్మకానికి ఉన్నాయి. ఇక కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటాకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఉన్న మారుతి వితారా బ్రెజా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, రెనో డస్టర్, టాటా నెక్సాన్, మహీంద్రా టీయూవీ300లతో పోల్చుకుంటే.. హ్యుందాయ్ క్రెటాకు అమ్మకాలు ఎక్కువగానే ఉన్నాయి. కొత్త క్రెటా కారుకే కాదు, సెకండ్ హ్యాండ్ కార్లకు కూడా భారీగానే డిమాండ్ ఉంది. మంచి కారు అయితే ధర రూ. పది లక్ష్యాలపైనే ఉంటుంది. ఇక హ్యుందాయ్ క్రెటా కారు మీకు ఇష్టం అయి డబ్బులు తక్కువగా ఉన్నా చింతించాల్సిన అవసరం లేదు.

సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్‌లో కూడా హ్యుందాయ్ క్రెటాకు చాలా మంచి డిమాండ్ ఉంది. ఇక  పాత కారును కొనుగోలు చేసినప్పుడు.. కొత్తగా రిజిస్ట్రేషన్ చేయవలసిన అవసరం లేదు.  రోడ్ టాక్స్ చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే కార్స్ 24 వెబ్‌సైట్‌లో ఉన్న కొన్ని సెకండ్ హ్యాండ్ కార్లకు ఇప్పటికే రోడ్ టాక్స్ చెల్లించేసి ఉంది. ఢిల్లీ, నోయిడాలో ఉండే వారికి కూడా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. కార్స్ 24 వెబ్‌సైట్‌లో ఉన్న హ్యుందాయ్ క్రెటా కార్ల వివరాలేమిటో ఒక సారి చూద్దాం..

  • Hyundai Creta 1.6 S: 2015 హ్యుందాయ్ క్రెటా 1.6 ఎస్ మాన్యువల్ ధర రూ.7,42,000గా ఉంది. ఇప్పటికే ఈ కారు పెట్రోల్ ఇంజన్‌తో 71,617 కిలోమీటర్లు నడిచింది. ఈ కారు మొదటి ఓనర్ నోయిడాలో అమ్మకానికి పెట్టాడు.
  • Hyundai Creta 1.6 S: 2016 హ్యుందాయ్ క్రెటా 1.6 S మాన్యువల్ రూ.7,58,000కు కార్స్ 24 వెబ్‌సైట్‌లో ఉంది. ఇప్పటి వరకు 76,938 కిలోమీటర్లు నడిచిన ఈ కారును దాని మూడో యజమాని నోయిడాలో అమ్మకానికి పెట్టాడు.
  • Hyundai Creta 1.6 SX (O) CRDI: 2015 హ్యుందాయ్ క్రెటా 1.6 SX (O) CRDI మాన్యువల్ కారు ధర రూ.7,72,000గా ఉండగా ఇది ఇప్పటివరకు డీజిల్ ఇంజిన్‌తో 56,170 కిలోమీటర్లు నడిచింది. ఈ కారును దాని  మొదటి యజమాని నోయిడాలో అమ్మకానికి ఉంచాడు.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ప్రచురించినది మాత్రమే. టెక్నాలజీ గురించి కొంత మేర అవగాహన కల్పించడంలో భాగంగానే ఇస్తున్నాము. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దయచేసి ఆలోచించగలరు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..