Vitamins For Skincare: మీ చర్మ సంరక్షణ కోసం సహాకరించే విటమిన్లు ఇవే..
చలికాలంలో చర్మం సంరక్షణ అత్యంత సవాలుతో కూడుకున్న విషయంగా మారుతుంది. ముఖ్యంగా చర్మం పొడిబారిపోవడం, దురద, చికాకు వంటి సమస్యలకు లోనవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని రకాల విటమిన్లు ఎంతో సహాయపడతాయి. అందుకే విటమిన్లు ఉన్న పోషకాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి.
Updated on: Dec 31, 2022 | 8:48 PM

Vitamins Food

Vitamin A: విటమిన్ ఏ కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించి చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అంతేకాక మొటిమలను నివారించడంలో, వృద్ధాప్యాన్ని తగ్గించడంలో కూడా విటమిన్ ఏ సహాయపడుతుంది.

Vitamin B3: విటమిన్ బీ 3 హానికరమైన సూర్యరశ్మి నుంచి చర్మాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. సూర్యరశ్మిలోని UVA , UVB కిరణాలు చర్మానికి ఎంతో హాని కలిగిస్తాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి విటమిన్ బి 3 పుష్కలంగా ఉండే ఆహారాలను తింటే సరిపోతుంది.

Vitamin K: రక్తం గడ్డకట్టడాన్ని నివారించడంలో విటమిన్ కే బాగా ఉపయోగపడుతుంది. అంతేకాక చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా ఉంచడానికి ఈ విటమిన్ సహాయపడుతుంది. అలాగే కంటి చుట్టూ ఉండే నల్లటి వలయాలను తొలగించడానికి కూడా దోహదపడుతుంది.

Vitamin E: చర్మానికి మెరుపును, మృదుత్వాన్ని ఇవ్వడంలో విటమిన్ ఈ సహకరిస్తుంది. అలాగే వృద్ధాప్యం లక్షణాలను నెమ్మదింపజేస్తుంది. విటమిన్ సీ అతి నీలలోహిత కిరణాల నుంచి రక్షించడమే కాక తామర వంటి ఇతర చర్మ సమస్యలను కూడా నయం చేస్తుంది.

Vitamin C: విటమిన్ సీ ఎక్కువగా శరీరంలో యాంటీఆక్సిడెంట్లను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. చర్మాన్ని సంరక్షించడంలో, చర్మంపై గాయాలను నయం చేయడంలో కూడా విటమిన్ సీ ఉపకరిస్తుంది. అంతేకాక శరీర రోగనిరోధక వ్యవస్థ పటిష్టమవడానికి కూడా ఈ విటమిన్ సహకరిస్తుంది.





























