Photonmatrix: సెకండ్‌కి 30 దోమలను చంపే సూపర్ ఫాస్ట్ వెపన్.. అతి త్వరలో మార్కెట్లోకి లేజర్ గన్!
Photonmatrix: దోమల నుంచి బయటపడేందుకు రకరకాల మార్గాలు, సొల్యూషన్స్ మార్కెట్లోకి చాలా కాలం నుంచి అందుబాటులోకి వచ్చాయి. దోమతెరల నుంచి మొదలుకొని, మాస్కిటో కాయిల్స్, దోమల బ్యాట్లు, స్ప్రే, తాజాగా లెమన్ గ్రాస్ ఇలా రకరకాల దోమల నివారణ మార్గాలు ఉన్నాయి. కానీ..

Photonmatrix: ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన అమెరికా నుంచి అట్టడుగున ఉన్న మంగోలియా వరకు కామన్ గా ఉన్న సమస్య దోమలు. మొన్న ఈమధ్య వైట్ హౌస్ లో ట్రంప్ ఫోటో ఒకటి రిలీజ్ అయితే అందులో ఆయన కూర్చున్న టేబుల్ పక్కన కూడా దోమలను చంపే బ్యాట్ కనిపించింది. అంటే వైట్ హౌస్‌ని కూడా దోమలు విడిచిపెట్టడం లేదన్నమాట.
అంతేకాకుండా ఈ దోమల వల్ల ప్రాణాంతక డెంగ్యూ, మలేరియా లాంటి రోగాలతో కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది చనిపోతున్నారు. కొన్ని కోట్లమంది ఈ దోమల వల్ల నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్న.. అందమైన అద్భుతమైన భవంతులు ఉన్న దోమలు మాత్రం కామన్ ప్రాబ్లం.
ఇది కూడా చదవండి: RBI Governor: కారు, గృహ రుణాలు మళ్ళీ చౌకగా మారనున్నాయా? ఆర్బీఐ గవర్నర్ చెప్పిందేమిటి?
ఈ దోమల నుంచి బయటపడేందుకు రకరకాల మార్గాలు, సొల్యూషన్స్ మార్కెట్లోకి చాలా కాలం నుంచి అందుబాటులోకి వచ్చాయి. దోమతెరల నుంచి మొదలుకొని, మాస్కిటో కాయిల్స్, దోమల బ్యాట్లు, స్ప్రే, తాజాగా లెమన్ గ్రాస్ ఇలా రకరకాల దోమల నివారణ మార్గాలు ఉన్నాయి. కానీ అన్నింటిలోనూ ఎంతో కొంత ఆరోగ్యానికి హాని కలిగించే కెమికల్స్ ఉంటున్నాయి. దోమలను చంపే ఈ రకమైన మందుల వల్ల చాలామంది శ్వాసకోస వ్యాధులకు గురవుతున్నారు.
అయితే ఇన్నాళ్ల తర్వాత మార్కెట్లోకి ఒక కొత్త దోమల నియంత్రణ మిషన్ రాబోతుంది. ఇది మార్కెట్లోకి వస్తే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరికీ దోమలు దాదాపుగా విముక్తి లభించినట్లే..
ఫోటాన్ మాట్రిక్స్ ల్యాబ్ ఈ ఫోటాన్ మాట్రిక్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది పూర్తిగా లేజర్ సాయంతో పని చేస్తుంది. లైడర్ టెక్నాలజీతో ఇది దోమలను గుర్తిస్తుంది. ఒక రూమ్‌లో ఇది ఎక్కడో చోట ఫిక్స్ చేస్తే.. చుట్టూ ఉన్న ప్రదేశంలో లైడర్ టెక్నాలజీ ద్వారా ఎక్కడెక్కడ దోమలు ఉన్నాయి 0.3 సెకండ్లలో గుర్తిస్తుంది. ఆ లోకేషన్‌ని వెంటనే లాక్ చేస్తుంది. ఆ వెంటనే లేజర్ రిలీజ్ అయి ఆ దోమల్ని చంపేస్తాయి. ఇదంతా కనురెప్ప పాటులో జరిగిపోతుంది. అంటే ఒక్క సెకండ్‌లో 30 దోమల వరకు చంపేస్తుంది. దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండవని చెబుతంది కంపెనీ. మనిషికి ఏమాత్రం హాని చేకూర్చని విధంగా రెసొల్యూషన్ లేజర్ కిరణాల ద్వారా దోమల్ని చంపేస్తాం అంటుంది.
ఇది కూడా చదవండి: IT Engineer Rapido: ర్యాపిడో డ్రైవర్‌గా మారిన ఐటీ ఇంజనీర్.. కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
ప్రస్తుతానికి ఈ ఫోటాన్ మ్యాట్రిక్స్ మార్కెట్లో అందుబాటులోకి ఇంకా రాలేదు. కానీ ఫ్రీ ఆర్డర్స్ మాత్రం కంపెనీ తీసుకుంటుంది. ఎవరికైనా ముందుగానే ఈ లేజర్ గన్ తీసుకోవాలనుకుంటే కంపెనీ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








