AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fridge Temperature: వేసవిలో ఫ్రిజ్‌ను ఏ ఉష్ణోగ్రత వద్ద ఆపరేట్ చేయాలి?

Fridge Temperature: అదనంగా ఫ్రిజ్‌లోని ఆహారం పరిమాణం, డోర్‌ ఎంత తరచుగా ఓపెన్‌ అవుతుంఇ.. ఫ్రిజ్ ఉన్న ప్రదేశం వంటి ఇతర అంశాలు కూడా లోపల ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తాయి. ఖాళీ ఫ్రిజ్ కంటే నిండిన ఫ్రిజ్ చల్లదనాన్ని బాగా నిలుపుకుంటుంది..

Fridge Temperature: వేసవిలో ఫ్రిజ్‌ను ఏ ఉష్ణోగ్రత వద్ద ఆపరేట్ చేయాలి?
Subhash Goud
|

Updated on: May 05, 2025 | 1:54 PM

Share

ప్రతి సీజన్‌కి రిఫ్రిజిరేటర్ తప్పనిసరి. శీతాకాలమైనా, వేసవి అయినా, రిఫ్రిజిరేటర్ ఎప్పుడూ ఆఫ్‌ చేయడం ఉండదు. కంటిన్యూ రన్‌ అవుతూనే ఉంటుంది. భారతదేశంలో మనం రకరకాల వాతావరణాన్ని అనుభవిస్తాము. అందుకే సీజన్‌ను బట్టి రిఫ్రిజిరేటర్‌లో ఎంత ఉష్ణోగ్రతను సెట్ చేయాలో చాలా మందికి అర్థం కాదు. వేసవి కారణంగా వేడిగా ఉంది. రిఫ్రిజిరేటర్ లోపల ఉంచిన ఆహారం చెడిపోకుండా, నీరు త్వరగా చల్లబడకుండా ఉండటానికి ఏ ఉష్ణోగ్రత వద్ద సెట్ చేయాలో మీకు కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం.

సాధారణంగా రిఫ్రిజిరేటర్ ఘనీభవన ఉష్ణోగ్రత దాని ఉష్ణోగ్రతను సెట్ చేయడానికి ఇచ్చిన సంఖ్యలపై ఆధారపడి ఉంటుంది. ఈ సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే, ఉష్ణోగ్రత అంత చల్లగా ఉంటుంది. మీ ఫ్రిజ్ సరిగ్గా చల్లబడకపోతే మీరు ఆ సంఖ్యను పెంచడం ద్వారా ఉష్ణోగ్రతను సెట్ చేయవచ్చు. అదేవిధంగా ఫ్రిజ్‌లో ఉష్ణోగ్రత చాలా చల్లగా ఉంటే, మీరు ఆ సంఖ్యను కూడా తగ్గించవచ్చు.

ప్రస్తుతం వాతావరణం చాలా వేడిగా ఉంటుంది కాబట్టి దానిని ఎక్కువగా ఉంచడం అవసరం. ఇప్పుడు మీరు రిఫ్రిజిరేటర్ పై 1, 2, 3, 4, 5 వంటి సంఖ్యలు రాసి ఉంటాయి. మరి సరైన సంఖ్య ఏమిటో ఎలా తెలుస్తుంది? వాస్తవానికి ప్రతి రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రత దాని సెట్టింగులు, మోడల్‌ను బట్టి మారవచ్చు. అయితే, రిఫ్రిజిరేటర్‌ను దాదాపు 4.4°C ఉష్ణోగ్రతకు సెట్ చేయడానికి, మీరు దానిని 4 లేదా 5 సంఖ్యకు సెట్ చేయవచ్చు.

మీ ఫ్రిజ్‌కి సరైన సెట్టింగ్ తెలుసుకోవడానికి కంపెనీ సూచనలను చదవండి లేదా మీరు ఆన్‌లైన్‌లో కూడా ఫ్రిజ్ మోడల్ కోసం సెర్చ్‌ చేయవచ్చు. ఇది మీ ఫ్రిజ్ ఎంత ఉష్ణోగ్రతకు సెట్ చేయబడిందో మీకు సమాచారం ఇస్తుంది. వేసవిలో మీ ఫ్రిజ్ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే, అది బాగా చల్లబడదు. అలాగే ఫ్రిజ్ లోపల నిల్వ చేసిన ఆహారం త్వరగా చెడిపోవచ్చు.

అంతేకాకుండా, ఫ్రిజ్‌లో ఉంచిన నీరు కూడా సరిగ్గా చల్లబడదు. వేడికి, ఫ్రిజ్‌లో ఉంచిన కూరగాయలు కూడా కుళ్ళిపోవడం మీరు గమనించి ఉంటారు. అందుకే వేడిలో ఫ్రిజ్‌ను సరైన ఉష్ణోగ్రతకు సెట్ చేయడం ముఖ్యం.

అదనంగా ఫ్రిజ్‌లోని ఆహారం పరిమాణం, డోర్‌ ఎంత తరచుగా ఓపెన్‌ అవుతుంఇ.. ఫ్రిజ్ ఉన్న ప్రదేశం వంటి ఇతర అంశాలు కూడా లోపల ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తాయి. ఖాళీ ఫ్రిజ్ కంటే నిండిన ఫ్రిజ్ చల్లదనాన్ని బాగా నిలుపుకుంటుంది. అయితే, ఓవర్ ఫిల్లింగ్ గాలి ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి