Smartphones: ఫీచర్లు భేష్.. పనితీరు శభాష్.. ఆ రెండు ఫోన్ల మధ్య తేడాలివే..!
ఆధునిక కాలంలో నత్యం అనేక మోడళ్ల సెల్ ఫోన్లు మార్కెట్ లోకి విడుదలవుతున్నాయి. కొత్త ఫీచర్లు, ప్రత్యేకతలతో ఎంతో ఆకట్టుకుంటున్నాయి. సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ అందుబాటులో ఉండేలా వివిధ ధరల్లో లభిస్తున్నాయి. వీటిలో మిడ్ రేంజ్ అంటే రూ.20 వేలలో లభించే ఫోన్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఆధునిక అవసరాలకు అనుగుణంగా వీటిని తయారు చేస్తున్నారు. ఈ విభాగంలో సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో, రియల్ మీ నార్జో 80 ఫోన్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో వీటి మధ్య తేడాలు, ధర వివరాలను తెలుసుకుందాం.

ప్రధానంగా ఈ రెండు ఫోన్లు రూ.20 వేల లోపు ధరలో లభిస్తున్నాయి. తాజా అప్ గ్రేడ్లు, మెరుగైన డిస్ ప్లే, ప్రాసెసర్, బెస్ట్ డిజైన్, ట్రిపుల్ కెమెరాలతో ఆకట్టుకుంటున్నాయి. ఒకే రకమైన పనితీరుతో వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నాయి. అనేక రకమైన పరీక్షల్లో ఈ రెండు స్పల్ప తేడాలతో సమఉజ్జీలుగా నిలిచాయి. సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో, రియల్ మీ నార్జో 80 ప్రో స్మార్ట్ ఫోన్ల పనితీరును తెలుసుకునేందుకు గీక్ బెంచ్ పరీక్ష నిర్వహించారు. రోజువారీ పనులు, గేమింగ్, ఎడిటింగ్, ఇంటెన్సివ్ వర్క్ లోడు సమయంలో వాటి సామర్థ్యాన్ని అంచనా వేశారు. ఈ పరీక్షలో రెండు ఫోన్లూ మంచి మార్కులు సాధించాయి. పని భారాన్ని సమర్థవంతంగా నిర్వహించాయి. అయితే రియల్ మీ కొంచెం ఎక్కువ స్కోర్ చేసినా, అది మరీ ఎక్కువ కాదు. దీంతో గిక్ బెంచ్ పరీక్షలో సమంగా నిలిచాయి.
రెండో పరీక్ష అయిన అన్ టుటు లోనూ రెండు ఫోన్లు తమ సత్తా చాటాయి. సీపీయూ, జీపీయూ, మెమరీ తదితర వాటిని దీని ద్వారా అంచనా వేస్తారు. ఈ పరీక్షలో రెండు ఫోన్లూ పనితీరు పరంగా సమానంగా నిలిచాయి. మల్టీ టాస్కింగ్, యాప్ లాంచ్ వేగం, రోజు వారీ పనులు, ఇంటెన్సివ్ టాస్క్ లలో రాణించాయి. రెండు ఫోన్లు మెరుగైన పనితీరుతో వినియోగదారులకు సేవలు అందిస్తాయి. సుధీర్ఘ గేమింగ్, మల్టీ టాస్కింగ్ సమయాల్లో స్థిరమైన పనితీరుతో ఉంటాయి. థర్మల్ నిర్వహణ, విద్యుత్ సామర్థ్యంలో తిరుగులేదు. దీన్ని అంచనా వేసేందుకు నిర్వహించిన బర్న్ అవుట్ పరీక్షలో దాదాపు 60 శాతం స్కోర్ చేశాయి. ఈ విభాగంలోనూ సమానంగా నిలిచాయి.
గేమింగ్ విషయంలోనూ ఒకదానితో మరోక ఫోన్ పోటీ నెలకొంది. దీన్ని పరీక్షించేందుకు బీజీఎంఐ, సీవోడీ మొబైల్, రియల్ రేసింగ్ 3లను ఒకేలాంటి గ్రాఫిక్ సెట్టింగులతో 30 నిమిషాలు ఆడారు. రెండు ఫోన్లు దాదాపు ఒకే మాదిరిగా ఫ్రేమ్ రేటును అందించాయి. సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ బేస్ వేరియంట్ రూ.18,999కు అందుబాటులో ఉంది. దీనిలో మీడియా టెక్ డైమెన్సిటీ 7300 ప్రో ప్రాసెసర్, 6.77 అంగుళాల డిస్ ప్లే, 50 ఎంపీ, 8 ఎంపీ, 50 ఎంపీ కెమెరాలు, ముందు 16 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ బాగున్నాయి. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీతో అందుబాటులోకి తీసుకువచ్చారు. రియల్ మీ నార్జో 80 ప్రోలో 6.7 అంగుళాల డిస్ ప్లే బాగుంది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ, 2 ఎంపీ, 16 ఎంపీ కెమెరాలు, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ బాగున్నాయి. ఈ ఫోన్ ధర రూ.19.999 నుంచి ప్రారంభమవుతుంది.
మరిన్ని టెక్ వార్త ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








