Whats App: వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. త్వరలో వాట్సాప్ వెబ్‌లో ఆ సేవలు షురూ..!
ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో వాట్సాప్ వాడే వారి సంఖ్య బాగా పెరిగింది. ముఖ్యంగా వాట్సాప్ లేని స్మార్ట్ ఫోన్ లేదంటే అతిశయోక్తి కాదు. వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు యూజర్లను ఆకట్టుకునేందుకు ఆసక్తికర అప్‌డేట్స్ ఇస్తూ ఉంటుంది. తాజాగా వాట్సాప్ వెబ్ వినియోగదారులకు స్మార్ట్ ఫోన్స్‌కే పరిమితమైన కొన్ని సేవలను అందిస్తామని ప్రకటించింది.

వాట్సాప్‌లో వెబ్‌లో కాలింగ్ ఫీచర్ కోసం వినియోగదారులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. చాలా ఏళ్లుగా ఈ సౌకర్యం వాట్సాప్‌లో అందుబాటులోకి వస్తుందని చాలా వార్తలు మల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలను నిజం చేసేలా వాట్సాప్ చర్యలు తీసుకుందని నిపుణులు చెబుతున్నారు. వాట్సాప్ తన బీటా వెర్షన్‌లో వాట్సాప్ వెబ్‌లో వాయిస్ లేదా వీడియో కాల్స్ చేసే సామర్థ్యాన్ని పరీక్షిస్తుందని స్పష్టం చేస్తున్నాు. క్రోమ్, సఫారీ, ఫైర్‌ఫాక్స్ వంటి బ్రౌజర్‌లలో పనిచేసే వాట్సాప్ వెబ్ బీటాలో కొత్త అప్‌డేట్ కనిపించింది. వాట్సాప్ వినియోగదారులు కాలింగ్ సపోర్ట్ కోసం విండోస్, మాకోస్ కోసం డెస్క్‌టాప్ యాప్‌పై ఆధారపడాల్సి ఉండేది. కానీ వాట్సాప్ తీసుకున్న చర్యలతో వాట్సాప్ వెబ్ యూజర్లు ఇకపై వీడియో కాలింగ్ సౌకర్యాన్ని అందించనుంది.
వాట్సాప్ వెబ్ వీడియో కాలింగ్ ఫీచర్ ప్రస్తుతం బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. వాట్సాప్ వెబ్‌లో క్లెయింట్ సెర్చ్ చేసే సమయంలో మెనూలో కొంత మందికి కాలింగ్ ఫీచర్ కనిపిస్తుందని వివరిస్తున్నారు. వాట్సాప్ వెబ్ ఇంటర్‌ఫేస్‌లో వీడియో, కాల్ చిహ్నాలు కనిపిస్తాయి. ఆ ఫీచర్‌ను ఓకే చేస్తే ఆటోమెటిక్‌గా కాల్ లేదా వీడియో కాల్ వెళ్తుంది. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు వాట్సాప్ వెబ్‌లో వాయిస్, వీడియో కాల్‌లకు మద్దతు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫీచర్. కాలింగ్ సపోర్ట్‌తో జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, గూగుల్ మీట్‌లకు పోటీగా కంపెనీకి మరిన్ని అవకాశాలు లభిస్తాయి.
వాట్సాప్‌లోని వీడియో, వాయిస్ కాలింగ్ మీ ఫోన్ నంబర్‌తో మాత్రమే పనిచేసే అవకాశం ఉంది. అంటే బిలియన్ల మంది తమ ఫోన్‌లలో మెసేజింగ్ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. రాబోయే కొన్ని నెలల్లో అందరికీ పబ్లిక్ వెర్షన్‌ను విడుదల చేస్తుందని నిపుణులు చెబుతున్నారు .మీ చాట్‌లు, మీడియా ఫైల్‌లను మరింత సురక్షితంగా ఉంచడానికి వాట్సాప్ ఇటీవల ఒక అధునాతన చాట్ సెక్యురిటీ ఫీచర్‌ను ప్రకటించింది. ఈ మెసేజింగ్ యాప్ ఇప్పుడు యూజర్లు మీడియా ఫైల్‌లను ఆటో-డౌన్‌లోడ్ చేయకుండా లేదా చాట్‌లను కాపీ చేసి మెసేజింగ్ యాప్‌లోని ఏఐ ఫీచర్‌ల కోసం ఉపయోగించకుండా ఆపుతుంది. ఫైల్‌ను కాపీ చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తికి పాప్-అప్ బాక్స్ కనిపిస్తుంది. ఇది కాంటాక్ట్ ఖాతాలోని సందేశాల కోసం అధునాతన చాట్ సెక్యూరిటీను ప్రారంభించారని వారికి తెలియజేస్తుంది.
మరిన్ని టెక్ వార్త ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








