AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apple Air Play: ఆపిల్‌ వినియోగదారులకు షాక్‌.. ఎయిర్‌ ప్లేకు హ్యాకర్ల ముప్పు

ఇటీవల కాలంలో యువత ఎక్కువగా స్మార్ట్‌ యాక్ససరీస్‌ వాడడాన్ని ఇష్టపడుతుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్‌ఫోన్‌ ఉంటున్న ప్రస్తుత తరుణంలో వాటికి కనెక్ట్‌ చేసుకుని వాడే పరికరాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే తాజాగా ఆపిల్‌ స్మార్ట్‌ యాక్ససరీస్‌పై కనెక్ట్‌ చేయడానికి ఉపయోగపడే ఆపిల్‌ ఎయిర్‌ ప్లే హ్యాకర్ల ముప్పు ఉందనే నివేదికలు యూజర్లను షాక్కు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆపిల్‌ ఎయిర్‌ప్లేపై హ్యాకర్ల ముప్పు గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Apple Air Play: ఆపిల్‌ వినియోగదారులకు షాక్‌.. ఎయిర్‌ ప్లేకు హ్యాకర్ల ముప్పు
Apple Airplay
Nikhil
|

Updated on: May 05, 2025 | 11:45 AM

Share

ఆపిల్‌కు సంబంధించిన ఎయిర్‌ప్లే ఫీచర్ ఆపిల్ పరికరాలతో అనుకూలమైన థర్ట్‌ పార్టీ స్పీకర్లు, టీవీల్లో సంగీతం, ఫోటోలు, వీడియోలను సజావుగా ప్రసారం చేయడానికి అనుమతిస్తుంది. అయితే ఎయిర్‌ప్లేలో కొత్తగా కనుగొన్న కొన్ని సెక్యూరిటీ ప్యాచ్‌ల కారణంగా హ్యాకర్లు ఈ వైర్‌లెస్ కనెక్షన్‌లను దోపిడీ చేయడానికి వీలు కల్పిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకే నెట్‌వర్క్‌లోని పరికరాల మధ్య మాల్వేర్‌ను వ్యాప్తి చేసే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. ఆపిల్ ఉత్పత్తులకు క్రమం తప్పకుండా పరిష్కారాలు ఉన్నప్పటికీ చాలా స్మార్ట్-హోమ్ పరికరాలు అరుదుగా వచ్చే అప్‌డేట్‌ల కారణంగా హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. అనేక ఎయిర్‌ప్లే ప్రారంభించిన మోడల్స్‌లో సంవత్సరాల తరబడి అప్‌డేట్స్‌ లేకపోవడం వల్ల హ్యాకర్లు సులభంగా వాటిని హ్యాక్‌ చేసే ప్రమాదం ఉంది. “ఎయిర్‌బోర్న్” అని పిలిచే మాల్వేర్‌ను ఉపయోగించి మీ ప్రైవేట్ డేటాను తస్కరిస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నార. 

మీ డివైజ్‌ విమానాశ్రయాలు, కాఫీ షాపులు లేదా మీ కార్యాలయ కార్యాలయం వంటి బహిరంగ ప్రదేశాలతో సహా మీ పరికరాల మాదిరిగానే వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయినప్పుడు మీ సంభాషణలను దొంగచాటుగా వినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హ్యాకర్ల బాధకు చెక్‌ పెట్టడానికి యూజర్లు తమ డివైజ్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని సూచిస్తున్నారు. ఎయిర్‌ప్లే ఫీచర్‌ను మీ డివైజ్‌లో యూజ్‌ చేయకపోతే దాన్ని పూర్తిగా నిలిపివేయాలని కూడా సిఫార్సు చేస్తున్నారు. ఎందుకంటే ఇది హ్యాకర్లు మీ పరికరాన్ని నియంత్రించడానికి ఒక యాక్సెస్ పాయింట్‌గా పనిచేస్తుంది. 

ఆపిల్‌కు సంబంధించిన ఎయిర్‌ప్లే ప్రోటోకాల్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్ (ఎస్‌డీకే) లో కనుగొన్నారు. ఇది వినియోగదారులను పరికరాల మధ్య ఫోటోలు, సంగీతం, వీడియోలను ప్రసారం చేయడానికి అనుమతిస్తుంది. ఆపిల్ తమ పరికరాల్లోని లోపాన్ని పరిష్కరించడానికి భద్రతా అప్‌డేట్స్‌ను విడుదల చేస్తుంది. అయితే స్మార్ట్ టీవీల నుంచి సెట్-టాప్ బాక్స్‌లు, కార్ సిస్టమ్‌ల వరకు మిలియన్ల కొద్దీ థర్డ్‌ పార్టీ గాడ్జెట్‌లు అప్‌డేట్స్‌ ఇవ్వకపోవడం వల్లే అసలు సమస్య అని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి థర్డ్‌ పార్టీ యాప్స్‌ ద్వారా యాపిల్‌ ప్లే ఒరిజినల్‌ యాప్‌ను ఉత్తమమని సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్త ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి