Facebook Thread: మరో కొత్త ఫీచర్‌ తీసుకొచ్చే పనిలో పడ్డ ఫేస్‌బుక్‌.. ట్విట్టర్‌లో ఉన్న ఆ సదుపాయాన్ని.

Facebook Thread: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలలో ఫేస్‌బుక్‌ మొదటి స్థానంలో ఉంటుంది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటోంది కాబట్టే ఈ సోషల్‌ మీడియా సైట్‌కు ఇంత క్రేజ్‌ ఉందని...

Facebook Thread: మరో కొత్త ఫీచర్‌ తీసుకొచ్చే పనిలో పడ్డ ఫేస్‌బుక్‌.. ట్విట్టర్‌లో ఉన్న ఆ సదుపాయాన్ని.
Facebook New Feature
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 08, 2021 | 7:15 PM

Facebook Thread: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలలో ఫేస్‌బుక్‌ మొదటి స్థానంలో ఉంటుంది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటోంది కాబట్టే ఈ సోషల్‌ మీడియా సైట్‌కు ఇంత క్రేజ్‌ ఉందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే యూజర్లను మరింత ఎక్కువగా అట్రాక్ట్‌ చేసేందుకు గాను ఫేస్‌బుక్‌ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రస్తుతం ట్విట్టర్‌లో అందుబాటులో ఉన్న థ్రెడ్‌ ఫీచర్‌ను ఫేస్‌బుక్‌లోనూ తీసుకురావాలని చూస్తున్నారు. సాధారణంగా ట్విట్టర్‌లో పోస్ట్‌ను మనం థ్రెడ్‌ల రూపంలో చేస్తామనే విషయం తెలిసిందే. సందేశాన్ని కేవలం 280 క్యారక్టర్లలో పోస్ట్‌ చేసే వీలుంటుంది కాబట్టే… ఇలా థ్రెడ్స్‌ రూపంలో సమాచారాన్ని పోస్ట్ చేస్తారు. ప్రస్తుతం ఇలాంటి ఫీచర్‌ను ఫేస్‌బుక్‌లో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫేస్‌బుక్‌ ఈ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది కూడా. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఫేస్‌బుక్‌ ఈ కొత్త ఫీచర్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రముఖ సోషల్‌ మీడియా కన్సల్టెంట్‌ మాట్‌ నవారా.. ఈ కొత్త ఫీచర్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ థ్రెడ్‌ ఫీచర్‌ యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని టెక్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ కొత్త ఫీచర్‌పై ఫేస్‌బుక్‌ అధికారిక ప్రకటన ఎప్పుడు చేస్తుందో చూడాలి.

Also Read: Truecaller:’యూజర్ల డేటాను ఇతర సంస్థలతో పంచుకుంటోన్న ట్రూకాలర్’.. నోటీసులు జారీ చేసిన బాంబే హైకోర్టు

OnePlus Nord 2: వన్‌ప్లస్‌ నుంచి మరో కొత్త మొబైల్‌.. లీకైన విడుదల తేదీ.. స్పెసిఫికేషన్లు..!

WhatsApp: వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో తెలుసుకోవాలా..? అయితే ఈ విధంగా చేయండి..!