- Telugu News Photo Gallery Technology photos Take these precautions while doing online transactions to avoid cyber attacks
Online Transactions: ఆన్‌లైన్‌లో లావాదేవీలు చేస్తున్నారా.? ఈ జాగ్రత్తలు పాటించండి. సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కకండి.
Online Transactions: ఆన్‌లైన్‌లో సేవలు అందుబాటులోకి వచ్చాయని సంతోషపడలా.? వీటి మాటున సైబర్ నేరగాళ్లు పొంచి ఉన్నారని భయపడలా తెలియని పరిస్థితులున్నాయి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సైబర్ మోసాల బారిన పడకుండా చూసుకొవచ్చు. అవేంటంటే..
Updated on: Jul 08, 2021 | 8:39 PM

ప్రస్తుతం ఆన్‌లైన్ లావాదేవీలు బాగా పెరుగుతున్నాయి. ప్రతీ చిన్న వస్తువును ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ అవకాశం మాటున సైబర్ దాడి అనే ప్రమాదం పొంచి ఉందని మీకు తెలుసా? దీనికి చెక్ పెట్టాలంటే ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సిందే.

ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ చేసే సమయంలో పబ్లిక్ వైఫ్ ఉపయోగించకూడదు. అనుమానాదస్పద యాప్‌ల ద్వారా లావాదేవీలు చూయకూడదు.

ఆన్‌లైన్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ను ఎప్పటికప్పుడు మార్చుకోండి. అదే విధంగా పాస్‌వర్డ్ స్ట్రాంగ్‌గా ఉండేలా చూసుకోవాలి.

ఫోన్‌కు వచ్చే మెసేజ్‌లో ఉండే లింక్‌లను క్లిక్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలి.

స్మార్ట్ ఫోన్‌లలో ఉండే యాప్‌లకు గుడ్డిగా అన్ని పర్మిషన్లు ఇవ్వకండి. ముఖ్యంగా మెసేజ్, కాంటాక్ట్ వివరాలు.

ఇలాంటి కొన్ని సింపుల్ టెక్నిక్స్‌ను ఉపయోగించి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుండా జాగ్రత్త పడొచ్చు.




