Pebble Smart Watch: మరో రెండు కొత్త స్మార్ట్ వాచ్‌లను రిలీజ్ చేసిన పెబుల్.. ఫీచర్లు తెలిస్తే షాకవుతారంతే..!
రెండు స్మార్ట్ వాచ్‌లు సింగిల్ కనెక్ట్ బీటీ కనెక్టివిటీ, నెక్స్ట్‌జెన్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను కలిగి ఉన్నాయి. పెబుల్ మిలీనియల్స్ ఆవశ్యకతను ఎల్లప్పుడూ అర్థం చేసుకుని తాజా తాజా లాంచ్ చేస్తున్నట్లు స్మార్ట్‌వాచ్‌ల ఆవిష్కరణ సందర్భంగా పెబుల్ సహ వ్యవస్థాపకుడు కోమల్ అగర్వాల్ తెలిపారు. తమ స్మార్ట్‌వాచ్‌ల్లో అన్ని ఆరోగ్య, ఫిట్‌నెస్‌కు సంబంధించి అన్ని ఫీచర్లు ఉంటాయి. కాబట్టి ఈ వాచ్ ఫీచర్లను ఓ సారి తెలుసుకుందాం.

భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న స్వదేశీ బ్రాండ్ అయిన పెబుల్ తన సరికొత్త ప్రీమియం స్మార్ట్‌వాచ్‌లు ఒడిస్సీ, అర్బేన్‌లను ఆవిష్కరించింది. క్లాసిక్ మెటల్ స్టైల్‌తో ఒడిస్సీ 1.46 అంగుళాల హెచ్‌డీ ఇన్ఫినిట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే అర్చేన్ వాచ్ 1.39 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే క్రిస్టల్ క్లారిటీని అందిస్తుంది. ఈ రెండు స్మార్ట్ వాచ్‌లు స్పోర్టీ లుక్‌ని ఔత్సాహికుల కోసం రూపొందించారు. ఒడిస్సీ, అర్బనే రెండు స్మార్ట్‌వాచ్‌లు రూ. 4499గా నిర్ణయించారు. ఈ రెండు స్మార్ట్ వాచ్‌లు సింగిల్ కనెక్ట్ బీటీ కనెక్టివిటీ, నెక్స్ట్‌జెన్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను కలిగి ఉన్నాయి. పెబుల్ మిలీనియల్స్ ఆవశ్యకతను ఎల్లప్పుడూ అర్థం చేసుకుని తాజా తాజా లాంచ్ చేస్తున్నట్లు స్మార్ట్‌వాచ్‌ల ఆవిష్కరణ సందర్భంగా పెబుల్ సహ వ్యవస్థాపకుడు కోమల్ అగర్వాల్ తెలిపారు. తమ స్మార్ట్‌వాచ్‌ల్లో అన్ని ఆరోగ్య, ఫిట్‌నెస్‌కు సంబంధించి అన్ని ఫీచర్లు ఉంటాయి. కాబట్టి ఈ వాచ్ ఫీచర్లను ఓ సారి తెలుసుకుందాం.
పెబుల్ ఒడిస్సీ
ఒడిస్సీ 1.46 ఇన్ఫినిట్ డిస్‌ప్లేతో మిమ్మల్ని లుక్‌తో వస్తుంది. ఈ వాచ్ ప్రీమియం రగ్గడ్ లుక్‌తో ఇది ఒక రౌండ్ డయల్‌తో స్పేస్ ఏజ్ డిజైన్‌ను, చిసెల్డ్ మెటాలిక్ కేసింగ్‌తో ప్రీమియం రొటేటింగ్ క్రౌన్ బటన్‌తో వస్తుంది. ఈ వాచ్ సిలికాన్ స్ట్రాప్స్ మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. జెట్ బ్లాక్, మెటల్ బ్లూ, అబ్సిడియన్ బ్లాక్ రంగుల్లో యూజర్లను ఆకర్షిస్తుంది. ముఖ్యంగా ఈ స్మార్ట్ వాచ్‌కు పాస్‌వర్డ్ లాక్ ఉంది. మల్టీ స్పోర్ట్స్ మోడ్‌తో పాటు, అడ్వాన్స్‌డ్ బీటీ కాలింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఈ వాచ్ ఏఐ వాయిస్ అసిస్టెంట్‌తో రావడంతో నావిగేట్ చేయడం సులభంగా ఉంటాయి. హృదయ స్పందన రేటు, ఎస్‌పీఓ 2, నిద్ర పర్యవేక్షణ కోసం అధునాతన సెన్సార్‌లతో వస్తుంది.
పెబుల్ అర్బేన్
రియల్‌టెక్ చిప్‌సెట్ ద్వారా ఆధారితంగా పని చేసే బీటీ కాలింగ్ స్మార్ట్‌వాచ్ 1.39 హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. మెటల్ అల్లాయ్ బాడీతో వచ్చే ఈ స్మార్ట్‌వాచ్ నీరు, ధూళి నిరోధకతతో వస్తుంది. ఈ వాచ్ బీటీ కాలింగ్, స్పీకర్ ఫోన్, కాల్ లాగ్స్, కీప్యాడ్, ఏఐ వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్లతో నెక్స్ జెన్ కనెక్టివిటీతో వస్తుంది. ఈ వాచ్ అధునాతన హెల్త్ సూట్‌లో ఎస్‌పీఓ2, హెచ్‌ఆర్, స్లీప్ మానిటరింగ్‌తో వెల్నెస్ గార్డియన్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ స్మార్ట్ క్యాలిక్యులేటర్, అలారం, నోటిఫికేషన్, మ్యూజిక్ కంట్రోల్స్, వెదర్ అప్‌డేట్, స్మార్ట్ నోటిఫికేషన్‌లు, మల్టిపుల్ వాచ్ ఫేస్‌లు వంటి స్మార్ట్ ఫీచర్‌లతో వస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..