Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meta: ఇకపై ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ వాడాలంటే డబ్బులు చెల్లించాల్సిందే.. నెలకు ఎంతంటే..

ఈమెయిల్ ఐడీ ఉంటే చాలు ఉచితంగా అకౌంట్‌ను క్రియేట్ చేసుకొని ఉపయోగించుకుంటున్నాం. అయితే రానున్న రోజుల్లో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు యూజ్‌ చేయాలంటే డబ్బులు చెల్లించాల్సిందే. ఆ దిశగా మెటా అడుగులు వేస్తోంది. 2024 నాటికి సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలని మెటా భావిస్తోంది. అయితే ఇది కేవలం ప్రకటనలు వద్దు అనుకునే వారికి మాత్రమే. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాలో ఫీడ్‌ చూస్తున్న సమయంలో...

Meta: ఇకపై ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ వాడాలంటే డబ్బులు చెల్లించాల్సిందే.. నెలకు ఎంతంటే..
Facebook
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 09, 2023 | 2:57 PM

ఫేస్‌బుక్‌.. ఈ ఒక్క పదం యావత్‌ ప్రపంచాన్ని శాసిస్తోంది. సోషల్‌ మీడియా అంటే ఏంటో ప్రపంచానికి తెలియజేసింది. ఒక చిన్న సైట్‌గా మొదలైన ఫేస్‌బుక్‌ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్‌ మీడియా దిగ్గజంగా మారింది. అనంతరం ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ వంటి సోషల్‌ మీడియాల సైట్స్‌ను కలుపుకొని మెటా అనే మాతృ సంస్థ ఏర్పడింది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ను యూజర్లకు ఉచితంగా వాడుకుంటున్నారు.

ఈమెయిల్ ఐడీ ఉంటే చాలు ఉచితంగా అకౌంట్‌ను క్రియేట్ చేసుకొని ఉపయోగించుకుంటున్నాం. అయితే రానున్న రోజుల్లో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు యూజ్‌ చేయాలంటే డబ్బులు చెల్లించాల్సిందే. ఆ దిశగా మెటా అడుగులు వేస్తోంది. 2024 నాటికి సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలని మెటా భావిస్తోంది. అయితే ఇది కేవలం ప్రకటనలు వద్దు అనుకునే వారికి మాత్రమే. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాలో ఫీడ్‌ చూస్తున్న సమయంలో ప్రకటనలు రావడం సాధారణమైన విషయమని తెలిసిందే. అయితే మెటా తీసకొస్తున్న ఈ పెయిడ్‌ సర్వీస్‌తో యూజర్లు ఎలాంటి యాడ్స్‌ లేకుండానే బ్రౌజ్‌ చేసుకునే అవకాశం లభిస్తుంది.

యూరోపియన్‌ నిబంధలనకు అనుగుణంగా యాడ్‌ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను తీసుకొస్తోంది. భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా మానటైజేషన్‌ మొదలు పెట్టాలని చూస్తున్న మెటా ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లకు యాడ్‌ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ తీసుకురావాలని ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2024 ఏప్రిల్‌ లేదా ఏడాది చివరి నాటికి ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్వాహకులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

అసలు కారణం ఇది..

ఇదిలా ఉంటే ఐర్లాండ్‌ ప్రైవసీ కమిషనర్‌.. వినియోగదారుడు అనుమతి లేకుండా ప్రకటనలు ఎలా ఇస్తున్నారన్న కారణంతో మెటాకు భారీ జరిమానా విధించింది. ఈ నేపథ్యంలోనే మెటా ఈ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకురావాలని భావిస్తోంది. ఈ లెక్కన సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోని వారందరూ ప్రకటనలు ఇవ్వడానికి అంగీకారం తెలిపినట్లేననేది మెటా వాదన. ఇక ఈ యాడ్‌ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ నెలకు 14 డాలర్లుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే ఇన్‌స్టాగ ఫేస్‌బుక్‌ యాడ్‌ ఫ్రీ డెస్క్‌టాప్‌ వెర్షన్‌కి 17 డాలర్లుగా ఉండొచ్చని అంచనా.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..