ANTS: బాబోయ్.. చీమల్లోనూ కుల వ్యవస్థ.. కులాన్ని బట్టి పనులు.. వెలుగులోకి సంచలన విషయాలు
చీమల గుట్టు తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 22వేల చీమ జాతులు ఉన్నాయి. ముఖ్యంగా మనుషుల లెక్కే చీమల్లోనూ కుల వ్యవస్థ ఉంది. చీమల కాలనీకి రాణి చీమ లీడర్‌గా ఉంటుంది. ఇక మగ చీమలు కేవలం ఆ పనికి మాత్రమే పనికొస్తాయి

చీమలకు ఎంతో ఘన చరిత్ర ఉంది. ప్రపంచంలో 22వేలకుపైగా చీమ జాతులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాటి జీవిత కాలం సుమారు 30 ఏళ్లు. ఇవి నీటి అడుగులో 24 గంటల పాటు జీవించగలవు. ఎన్నో ఏళ్లుగా జీవశాస్త్రవేత్తలు చీమల ప్రపంచం పట్ల ఆకర్షితులై.. వాటి గుట్టును తెలుసుకునేందుకు ఎన్నో పరిశోధనలు జరిపారు. చీమల కాలనీలలో కుల వ్యవస్థ ఉంటుంది. ఇందులో రాణులు, మగచీమలు, కార్మికులుగా మూడు విభాగాలు ఉంటాయి. ప్రతి కులం ప్రత్యేకమైన పనులను నిర్వర్తిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రధానంగా రాణి చీమలు కాలనీకి నాయకత్వం వహిస్తాయి. గుడ్లు పెడుతుంది. మగచీమలు రాణి చీమలతో సంభోగం చేయడానికి మాత్రమే ఉంటాయి. కార్మిక చీమలు కాలనీ కోసం ఆహారం సేకరించడం, గూడును నిర్మించడం సహా ఇతర పనులు చేస్తాయి.
ఇక ప్రతీ కులానికి ప్రత్యేకమైన శరీర నిర్మాణం ఉంటుంది. రాణి చీమలకు రెండు రెక్కలు ఉంటాయి. అవి పెద్దగా ఉంటాయి. కార్మిక చీమలకు రెక్కలు ఉండవు. చిన్నగా ఉంటాయి. తాజాగా అభివృద్ధి చెందుతున్న చీమ రాణిగా మారుతుందా లేదా కార్మికుడిగా మారుతుందా అనేదానికి పర్యావరణం లేదా జన్యుశాస్త్రం ఏ విధమైన పాత్రను పోషిస్తాయనేదానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. చీమల కులం జన్యుపరంగా నిర్ణయించబడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. రాణి చీమలకు పెద్ద అండాశయం, ప్రత్యేక కళ్ళు ఉంటాయి. అయితే కార్మికులకు ఈ లక్షణాలు లేవు. ఆహారం, ఉష్ణోగ్రత, సంరక్షకుని జన్యురూపాలను మార్చడం ద్వారా.. చీమల శరీర పరిమాణాన్ని ప్రభావితం చేయోచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. చిన్న చీమలు కార్మికులుగా మిగిలిపోగా.. పెద్దగా పెరిగినవి రాణి చీమలుగా అభివృద్ధి చెందాయి.
ఒకే పరిమాణంలో ఉన్న రెండు చీమలు.. వేర్వేరు జన్యువుల రాణులుగా మారడానికి చాలా భిన్నమైన అవకాశాలను కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పాత్రలను విభజించడానికి చీమలు బలమైన, జన్యుపరంగా నియంత్రించబడిన వ్యవస్థను అభివృద్ధి చేశాయని పరిశోధనలు హైలైట్ చేస్తున్నాయి.




