Foldable iPhone: ఆపిల్ మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్.. ధర, ఫీచర్స్ వివరాలు ఇవే..
ఆపిల్ యొక్క మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్ గురించి లీక్స్ బయటకొచ్చాయి. ఈ లీక్స్ కవర్, ఇన్నర్ స్క్రీన్స్ సమాచారాన్ని బయటపెట్టాయి. శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 తో పోటీపడే ఈ ఫోన్‌లో ఎన్ని అంగుళాల స్క్రీన్ అందుబాటులో ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఐఫోన్.. క్రేజే వేరు. ఐఫోన్ వాడాలనేది ప్రతి ఒక్కరి కల. కానీ ఎక్కువ రేట్ వల్ల చాలా మంది వెనకడుగు వేస్తారు. ఆపిల్ ఫోన్ అయితే సెక్యూరిటీ ఫీచర్స్ బాగుంటాయని అందరు దానిపై ఆసక్తి చూపుతారు. మరికొన్ని రోజుల్లో ఐఫోన్ 17 ఎయిర్ లాంచ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆపిల్ త్వరలో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ విభాగంలోకి కూడా అడుగుపెట్టనుంది. కంపెనీ యొక్క మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్ వచ్చే ఏడాది లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఫోల్డబుల్ ఐఫోన్ గురించి తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఈ ఫోన్ గురించి కొన్ని లీక్స్ వస్తున్నాయి. ఈ లీక్స్ స్క్రీన్ సైజు, ధరను వెల్లడించాయి.
ఫోల్డబుల్ ఐఫోన్ స్క్రీన్ సైజు..
ఫోల్డబుల్ ఐఫోన్ 5.5 అంగుళాల కవర్ డిస్‌ప్లే, 7.8 అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని ట్రెండ్‌ఫోర్స్ నివేదిక తెలిపింది. ఈ స్క్రీన్ సైజును చూస్తే.. ఫోల్డబుల్ ఐఫోన్‌లోని రెండు డిస్‌ప్లేలు ఇటీవల లాంచ్ అయిన శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 కంటే చిన్నవిగా ఉన్నట్లు అనిపిస్తుంది. మరోవైపు మనం గెలాక్సీ Z ఫోల్డ్ 7 గురించి మాట్లాడుకుంటే.. శామ్‌సంగ్ యొక్క ఈ ఫోల్డబుల్ ఫోన్ 8-అంగుళాల ఫ్లెక్స్ ఇన్నర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. కవర్ డిస్క ప్లే 6.5-అంగుళాల ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మెరుగైన క్వాలిటీ కోసం హ్యాండ్‌సెట్‌లో మెటల్ హింజ్, బ్యాక్‌ప్లేట్ ఉంటుంది. దీనిని ఫైన్ ఎమ్-టెక్ రూపొందిస్తుంది. ఫోల్డబుల్ ఐఫోన్ ఆపిల్ యొక్క ఆప్టిమైజ్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.
ఫోల్డబుల్ ఐఫోన్ ధర (అంచనా)
ఫోల్డబుల్ ఐఫోన్ ధర గురించి అందరూ ఆసక్తిగా సెర్చ్ చేస్తున్నారు. అయితే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం.. రూ.1,93,000 ప్రారంభ ధరగా ఉంటుందని తెలుస్తోంది. 512GB లేదా 1టీబీ స్టోరేజ్ ఉన్న ఫోల్డబుల్ ఐఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌లు వరుసగా రూ. 2,17,200, రూ. 2,41,400 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 యొక్క అదే స్టోరేజ్ వేరియంట్‌ల ధర రూ. 1,81,000, రూ. 2,11,300 గా ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లతో పోటీ..
ఇప్పటివరకు వెలువడిన అనేక నివేదికలు ఈ ఫోన్ 2026లో లాంచ్ చేయవచ్చని తెలియజేశాయి. ఈ ఫోన్ లాంచ్ అయితే, ఇది శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7, అలాగే వివో X ఫోల్డ్ 5 వంటి మోడళ్లతో పోటీపడుతుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




