Google Update: అదరగొడుతున్న గూగుల్ నయా అప్‌డేట్స్.. ఆ ఫీచర్స్‌తో లాభాలెన్నో..!
ప్రస్తుత రోజుల్లో గూగుల్ అంటే తెలియని వారు ఉండరు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగాక గూగుల్‌లో సెర్చ్ చేయడం అనేది ప్రాథమిక విధిగా మారింది. గూగుల్ కూడా వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడానికి ఎప్పటికప్పుడు సరికొత్త అప్‌డేట్స్ ఇస్తూ ఉంటుంది. తాజాగా గూగుల్ రిలీజ్ చేసిన ఐదు అప్‌డేట్స్ వినియోగదారులన విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ప్రస్తుత రోజుల్లో గూగుల్ అంటే తెలియని వారు ఉండరు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగాక గూగుల్‌లో సెర్చ్ చేయడం అనేది ప్రాథమిక విధిగా మారింది. గూగుల్ కూడా వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడానికి ఎప్పటికప్పుడు సరికొత్త అప్‌డేట్స్ ఇస్తూ ఉంటుంది. తాజాగా గూగుల్ రిలీజ్ చేసిన ఐదు అప్‌డేట్స్ వినియోగదారులన విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఉన్న టాక్‌బ్యాక్, సర్కిల్ వంటి టూల్స్ సామర్థ్యాలను గూగుల్ విస్తరించింది. ముఖ్యంగా గూగుల్ వేర్ ఓస్ పరికరాల కోసం గుర్తించదగిన అప్‌డేట్‌తో పాటు గూగుల్ క్రోమ్, ఆండ్రాయిడ్ భూకంప హెచ్చరికల సిస్టమ్‌కు మెరుగుదలలతో సహా ఐదు కొత్త ఫీచర్‌లను ఆవిష్కరించింది. ఈ నేపథ్యంలో గూగుల్ అప్‌డేట్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
గూగుల్ ఇటీవలల బ్లాగ్ పోస్ట్‌లో వివరించిన ఈ అప్‌డేట్స్ గూగుల్ పిక్సెల్ లైనప్‌లో మాత్రమే కాకుండా అన్ని అనుకూల ఆండ్రాయిడ్ పరికరాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫీచర్‌ల రోల్ అవుట్ ఇప్పటికే ప్రారంభమైనప్పటికీ వినియోగదారులందరికీ వాటిని అందుకోవడానికి రెండు వారాల వరకు పట్టవచ్చు .దృష్టి లోపం ఉన్న వినియోగదారులకు సహాయం చేయడానికి రూపొందించిన అంతర్నిర్మిత స్క్రీన్ రీడర్ టాక్‌బ్యాక్ కోసం గ్యాలరీలు, టెక్స్ట్ మెసేజ్‌లు లేదా సోషల్ మీడియా పోస్ట్‌లతో సహా వివిధ డిజిటల్ చిత్రాల కోసం మరింత సమగ్రమైన ఆడియో వివరణలను అందించడానికి ఏఐ జెమినీ ద్వారా సేవలను అందిస్తుంది.
సర్కిల్ టు సెర్చ్‌లో ఇచ్చిన అప్‌డేట్ ప్రకారం వినియోగదారులను వారి పరికరంలో లేదా పరిసర వాతావరణంలో ప్లే చేస్తున్న సంగీతాన్ని గుర్తించడం సులభం అవుతుంది. మ్యూజిక్ బటన్‌ను ఎంచుకోవడం ద్వారా వినియోగదారులు పాట శీర్షిక, పాడిన వారు వంటి వివరాలతో పాటు ఆ వీడియోను యూట్యూబ్ ద్వారా యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. గూగుల్ క్రోమ్ టెక్ట్స్ టు స్పీచ్ ద్వారా వినియోగదారులు నేరుగా బ్రౌజర్‌లో కథనాలు, వెబ్ పేజీలను వినడానికి అనుమతిస్తుంది. వినియోగదారులు వేగం, వాయిస్ మోడ్, భాషను సర్దుబాటు చేసుకోవచ్చు. గూగుల్ వేర్ ఓఎస్ కోసం ఆఫ్‌లైన్ మ్యాప్స్ అప్‌డేట్ చేశారు. ఈ ఫీచర్ స్మార్ట్‌ఫోన్ కనెక్షన్ లేకుండా కూడా వారి స్మార్ట్‌వాచ్‌ల నుండి నేరుగా మ్యాప్‌లను యాక్సెస్ చేయవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..