iPhone 16: సమయం రానే వచ్చేస్తోంది.. సెప్టెంబర్‌ 9న గ్రాండ్‌ ఈవెంట్‌.. లైవ్ చూడటం ఎలా?

ఆపిల్‌ కొత్త iPhone కోసం నిరీక్షణకు తెరపడనుంది. సెప్టెంబర్ 9న జరగనున్న 'ఇట్స్ గ్లోటైమ్' ఈవెంట్‌లో ఐఫోన్‌ 16, అలాగే 16 ప్లస్‌, 16 ప్రో, 16 ప్రోమ్యాక్స్‌ మోడళ్లను కంపెనీ పరిచయం చేయవచ్చు. ఐఫోన్ 16 సిరీస్ విడుదల కార్యక్రమం భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు యుఎస్‌లోని కుపెర్టినోలోని ఆపిల్ పార్క్‌లోని..

iPhone 16: సమయం రానే వచ్చేస్తోంది.. సెప్టెంబర్‌ 9న గ్రాండ్‌ ఈవెంట్‌.. లైవ్ చూడటం ఎలా?
Iphone
Follow us

|

Updated on: Sep 08, 2024 | 11:46 AM

ఆపిల్‌ కొత్త iPhone కోసం నిరీక్షణకు తెరపడనుంది. సెప్టెంబర్ 9న జరగనున్న ‘ఇట్స్ గ్లోటైమ్’ ఈవెంట్‌లో ఐఫోన్‌ 16, అలాగే 16 ప్లస్‌, 16 ప్రో, 16 ప్రోమ్యాక్స్‌ మోడళ్లను కంపెనీ పరిచయం చేయవచ్చు. ఐఫోన్ 16 సిరీస్ విడుదల కార్యక్రమం భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు యుఎస్‌లోని కుపెర్టినోలోని ఆపిల్ పార్క్‌లోని స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో ప్రారంభమవుతుంది. అయితే ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్స్‌ ఇప్పటికే లీకయ్యాయి.

భారతదేశంలో ఈ ఈవెంట్‌ను కంపెనీ వెబ్‌సైట్, ఆపిల్‌ టీవీ, YouTubeలో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. ఆపిల్‌ ఇప్పటికే తన YouTube ఛానెల్‌లో ఈవెంట్ ప్లేస్‌హోల్డర్‌ను షేర్ చేసింది. చాలా కాలంగా ఈ ఫోన్‌ల గురించి చర్చ జరుగుతుండగా, ఇప్పుడు ఈ ఫోన్‌లకు సంబంధించిన ప్రత్యేక సమాచారం కూడా వెలుగులోకి వచ్చింది. ఫోన్‌ కెమెరా గురించి ఆసక్తి నెలకొంది. ఈసారి ఆపిల్ నాలుగు కొత్త ఐఫోన్‌ల కెమెరాలలో పెద్ద మార్పు కనిపించనుందని అంటున్నారు.

ఇది కూడా చదవండి: Business Idea: ఏలకుల సాగుతో లక్షల్లో లాభం.. పండించే విధానం ఏంటి?

ఇవి కూడా చదవండి

నివేదిక ప్రకారం.. iPhone 16, iPhone 16 Plus మునుపటి మోడల్‌ల మాదిరిగానే డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయని భావిస్తున్నారు. అయితే గతంతో పోలిస్తే ఈసారి కొన్ని అప్‌గ్రేడ్‌లతో కెమెరాలు రానున్నట్లు తెలుస్తోంది. దీని ప్రైమరీ కెమెరా 1x, 2x జూమ్‌తో 48-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్‌తో రావచ్చు. దీని సెకండరీ కెమెరా అల్ట్రా-వైడ్ లెన్స్‌తో రావచ్చు. ఇది 0.5x జూమ్‌తో అందించబడుతుంది.

ఐఫోన్ 16 ధర ఎంత?

ఐఫోన్ 16 ధర గురించి ఇంకా అధికారిక సమాచారం రాలేదు. అయితే ఇది మునుపటి మోడళ్ల కంటే కొంచెం ఖరీదైనదని ఉండే అవకాశం ఉందని అంచనా. అయినప్పటికీ, ఐఫోన్ వినియోగదారులకు ఇది ఒక ముఖ్యమైన అప్‌డేట్‌, వారు దీని ప్రారంభం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆపిల్ తన ఐఫోన్‌లలో సరికొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను అందించడంలో ప్రసిద్ధి చెందింది. iPhone 16 కొత్త ఆపరేటింగ్ సిస్టమ్, మెరుగైన సాఫ్ట్‌వేర్ ఫీచర్‌లను కలిగి ఉండవచ్చు. ఇది వినియోగదారులకు మరింత మృదువైన, స్పష్టమైన అనుభవాన్ని అందిస్తుంది. ఇది కాకుండా ఐఫోన్ 16 భద్రతా లక్షణాలను కూడా కలిగి ఉండవచ్చు. తద్వారా వినియోగదారుల డేటాను రక్షించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు