Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైల్వే సంబంధించి ఫిర్యాదు చేయాలా? అన్నింటికి ఒకే నంబర్‌.. అదేంటంటే..

Helpline Number: రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం నిరంతరం పలు ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే ఇప్పుడు రైల్వేకు సంబంధించిన ఫిర్యాదుల కోసం వివిధ నంబర్లు డయల్‌ చేయాల్సిన అవసరం లేదు. రైల్వేశాఖ అన్ని హెల్ప్‌లైన్‌ నెంబర్లు విలీనం చేసేసింది. ఇప్పుడు ఈ అన్ని నెంబర్లకు బదులుగా రైల్‌ మద్దత్‌ అనే పేరుతో..

Indian Railways: రైల్వే సంబంధించి ఫిర్యాదు చేయాలా? అన్నింటికి ఒకే నంబర్‌.. అదేంటంటే..
Helpline Number
Subhash Goud
|

Updated on: Sep 07, 2024 | 12:03 PM

Share

Helpline Number: రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం నిరంతరం పలు ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే ఇప్పుడు రైల్వేకు సంబంధించిన ఫిర్యాదుల కోసం వివిధ నంబర్లు డయల్‌ చేయాల్సిన అవసరం లేదు. రైల్వేశాఖ అన్ని హెల్ప్‌లైన్‌ నెంబర్లు విలీనం చేసేసింది. ఇప్పుడు ఈ అన్ని నెంబర్లకు బదులుగా రైల్‌ మద్దత్‌ అనే పేరుతో 139 నెంబర్‌ డయల్‌ చేస్తే సరిపోతుంది. అన్ని ఫిర్యాదులు కూడా ఇదే నంబర్‌కు చేయవచ్చు. ఇక ప్రయాణికులు ఇకపై హెల్ప్‌లైన్‌ నెంబర్లన్నీ గుర్తించుకోవాల్సిన అవసరం లేదని రైల్వే తెలిపింది. రైలు ప్రయాణికులు ఇక నుంచి 139 నెంబర్‌కు డయాల్‌ చేసి రైల్వే ప్రయాణానికి సంబంధించి ఏ ఫిర్యాదులైనా తెలియజేయవచ్చని సూచించింది.

కాగా, రైళ్ల రాకపోకల సమయాలు, టికెట్‌ బుకింగ్‌ సదుపాయం, రద్దు చేసుకునే సదుపాయం, ప్రయాణ సమయంలో భద్రత, వైద్య సాయం, ఇలా ఎన్నో రకాల సమాచారాన్ని తెలుసుకునేందుకు రైల్వే శాఖ ఈ నెంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రైల్వేశాఖలోని హెల్ప్‌లైన్‌ నెంబర్లను దీనికి అనుసంధానం చేసింది. ప్రస్తుతం హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 182ను 139లో అనుసంధానం చేసింది రైల్వే. అయితే ప్రయాణికుల మరింత సులభతరం చేసేందుకు ఇలాంటి సదుపాయలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.

Indian Railways

ఇవి కూడా చదవండి

ఈ నంబర్‌ ద్వారా భద్రతకు సంబంధించి ఫిర్యాదు చేయవచ్చు. అలాగే మెడికల్‌ ఎమర్జెన్సీ, కోచ్‌ల క్లినింగ్‌కు సంబంధించి, విజిలెన్స్‌, యాంటీ కరప్షన్‌ క్యాటరింగ్‌పై ఫిర్యాదు చేయవచ్చు. ఇక పీఎన్‌ఆర్‌ స్థితి, రైలు రన్నింగ్‌ స్థితి మొదలైనవి. ప్రమాదం జరిగినప్పుడు ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.