AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI: ఖాతాదారులను హెచ్చరించిన ఎస్‌బీఐ.. ఆ మెసేజ్‌లతో జాగ్రత్త అంటూ..

ప్రస్తుతం సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రజల అత్యాశను, తెలియని తనాన్ని ఆసరాగా చేసుకొని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో దేశంలో రోజురోజుకీ సైబర్‌ నేరాల బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రపంచంలో ఎక్కడో కూర్చొని మన ఖాతాల్లోని డబ్బులను కాజేస్తున్నారు కేటుగాళ్లు. ముఖ్యంగా నకిలీ మెసేజ్‌ల ద్వారా ఖాతాలను...

SBI: ఖాతాదారులను హెచ్చరించిన ఎస్‌బీఐ.. ఆ మెసేజ్‌లతో జాగ్రత్త అంటూ..
SBI
Narender Vaitla
|

Updated on: Sep 08, 2024 | 8:49 PM

Share

ప్రస్తుతం సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రజల అత్యాశను, తెలియని తనాన్ని ఆసరాగా చేసుకొని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో దేశంలో రోజురోజుకీ సైబర్‌ నేరాల బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రపంచంలో ఎక్కడో కూర్చొని మన ఖాతాల్లోని డబ్బులను కాజేస్తున్నారు కేటుగాళ్లు. ముఖ్యంగా నకిలీ మెసేజ్‌ల ద్వారా ఖాతాలను హ్యాక్‌ చేస్తూ డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ రకమైన మోసం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ తమ ఖాతాదారులను అలర్ట్‌ చేసింది.

నకిలీ మెసేజ్‌ల ద్వారా ఖాతాల నుంచి డబ్బులు విత్‌డ్రా అవుతున్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎస్‌బీఐ పేరితో వచ్చే ఫేక్ మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం జారీ చేసిన సలహాలో పేర్కొంది. గత కొన్ని రోజుల నుంచి రివార్డ్‌ పాయింట్ల పేరుతో ఓ మోసం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎస్‌బీఐ పేరుతో రివార్డులను క్లైమ్‌ చేసుకోవాలంటూ కొందరు సైబర్‌ నేరస్థులు నకిలీ మెసేజ్‌లను సర్క్కూలేట్ చేశారు. వీటిని ఓపెన్‌ చేసి, వ్యక్తిగత వివరాలు అందజేసి మోసపోయి కేసులు ఇటీవల చాలా వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయమై ఎస్‌బీఐ ఖాతాదారులను అలర్ట్ చేసింది. ఈమెయిల్స్‌, మెసేజ్‌లతో పాటు సోషల్‌ మీడియాలో రివార్డ్స్‌ పాయింట్స్‌ పేరిట వస్తున్న ఫ్రాడ్‌ మెసేజ్‌లతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ఎస్‌బీఐ నెట్‌ బ్యాంకింగ్ రివార్డ్‌ పాయింట్ పేరుతో ఓ మెసేజ్‌ వైరల్ అవుతోంది. ఈ మెసేజ్‌ ప్రకారం రూ. 9980 విలువైన పాయింట్లను రీడిమ్‌ చేసుకోవాలని సందేశంలో పేర్కొంటున్నారు. అయితే ఈ పాయింట్స్‌ను రీడిమ్‌ చేసుకోవాలంటే ఒక ఏపీకే ఫైల్‌ను డౌనల్‌లోడ్‌ చేసుకోవాలని సూచిసత్ఉన్నారు. అయితే ఈ ఏపీకే ఫైల్‌ను పొరపాటున డౌన్‌లోడ్‌ చేశారో ఇక మీ ఫోన్‌ సైబర్‌ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లడం ఖాయం. దీంతో ఈ ఫోన్‌లో ఉన్న డేటా మొత్తం వారి చేతుల్లోకి వెళ్లిపోతాయి.

దీంతో మీ ఓటీపీలను సైబర్ నేరస్థులు యాక్సెస్‌ చేస్తారు. వాట్సాప్‌లో కూడా ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయని వీటిపట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. చూశారుగా ఉచితంగా రివార్డ్‌ పాయింట్స్‌ వస్తున్నాయని క్లిక్‌ చేశారో ఇక మీ పని అంతే అవుతుంది. రివార్డ్‌ పాయింట్లకు సంబంధించి ఎస్‌బీఐ అధికారిక యాప్‌నే విశ్వసించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఏపీలో ఏ క్షణమైనా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌..
ఏపీలో ఏ క్షణమైనా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌..
నైటీల్లో వచ్చి SBI ఏటీఎం లూటీ.. వీడియో చూస్తే మతిపోద్ది!
నైటీల్లో వచ్చి SBI ఏటీఎం లూటీ.. వీడియో చూస్తే మతిపోద్ది!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే పంపిణీ..
ఏపీ ప్రజలకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే పంపిణీ..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్