TATA: టాటా సన్స్ ఛైర్మన్ వేతనం ఎంతో తెలుసా? దేశంలోనే అత్యధిక జీతం ఇతనిదే!
టాటా గ్రూప్‌కు చెందిన నాన్-లిస్టెడ్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ జీతం ఎంతో తెలిస్తే షాకవుతారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 19.8 శాతం పెరిగింది. ఆయన వేతనం అక్షరాల రూ.135.3 కోట్లు. హోల్డింగ్ కంపెనీ లాభాల ఆధారంగా కమీషన్ పెరగడమే ఇందుకు కారణం. టాటా..
టాటా గ్రూప్‌కు చెందిన నాన్-లిస్టెడ్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ జీతం ఎంతో తెలిస్తే షాకవుతారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 19.8 శాతం పెరిగింది. ఆయన వేతనం అక్షరాల రూ.135.3 కోట్లు. హోల్డింగ్ కంపెనీ లాభాల ఆధారంగా కమీషన్ పెరగడమే ఇందుకు కారణం. టాటా సన్స్ వార్షిక నివేదిక ప్రకారం.. చంద్రశేఖరన్ రూ. 121.5 కోట్లు కమీషన్ పొందారు. మిగిలినది వేతనం. టాటా సన్స్‌లోని డైరెక్టర్లందరి మొత్తం వేతనం 16 శాతం పెరిగింది. కంపెనీ తన టాప్ డైరెక్టర్‌లకు రూ. 200 కోట్లు చెల్లించింది. ఇది 2022-23 ఆర్థిక సంవత్సరంలో (FY23) రూ. 172.5 కోట్లుగా ఉంది. ఇదే కాలంలో టాటా సన్స్ ఉద్యోగుల వేతనాలు 2.5 శాతం పెరిగి రూ.441 కోట్లకు చేరుకుంది.
టాటా సన్స్ టాప్ మేనేజ్‌మెంట్ జీతం ఎంత పెరిగింది?
బిజినెస్ స్టాండర్డ్స్ రీసెర్చ్ బ్యూరో డేటా ప్రకారం.. బీఎస్‌ఈ 200 కంపెనీల ప్రధాన నిర్వాహక సిబ్బంది లేదా టాప్ మేనేజ్‌మెంట్ మొత్తం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3.9 శాతం పెరిగి రూ. 8,304 కోట్లకు చేరుకుంది. గత ఏడాది రూ 7,990 కోట్లు. గత నాలుగేళ్లలో ఎగ్జిక్యూటివ్ పరిహారంలో నెమ్మదిగా పెరగడం ఇదే.
ఇక టీసీఎస్ సీఈఓ కృతి వాసన్ వార్షిక వేతనం రూ.25 కోట్లు కాగా.. ఐహెచ్‌సీఎల్ హెడ్ పునీత్ చత్వాల్ వేతనం రూ.19కోట్లుగా ఉంది. టాటా స్టీల్ చీఫ్ టీవీ నరేంద్రన్ ఏడాదికి రూ.17 కోట్లు అందుకుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఇక టాటా గ్రూపులో అత్యధిక వేతనం అందుకుంటున్న వారిలో టాటా పవర్ సీఈఓ ప్రవీర్ సిన్హా, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ సునీల్ డిసౌజా ఏడాదికి రూ.10 కోట్లు చొప్పున అందుకుంటున్నారు. టాటా కెమికల్స్ సీఈఓ ఆర్ ముకుందన్ రూ.8 కోట్లు. అలాగే టాటా గ్రూపు సీఈఓలకు వేతనంతో పాటు కంపెనీలో వాటాలూ కూడా ఉన్నాయట.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి