- Telugu News Photo Gallery Technology photos Follow these tech tips to uninstall your apps from computer
Smartphone: మీ స్మార్ట్‌ఫోన్ పోయిందా.? యాప్స్‌ను ఇలా అన్‌ఇన్‌స్టాల్ చేయండి..
స్మార్ట్‌ఫోన్ రాకతో పరిస్థితులన్నీ మారిపోయాయి. ఒకప్పుడు కేవలం ఫోన్ అంటే దూరంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేందుకు ఉపయోగించిన ఓ గ్యాడ్జెట్. కానీ ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ల రాకతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఫోన్‌తో చేయలేని పని అంటూ ఏది లేదు. ఇక వ్యక్తిగత వివరాలు కూడా ఫోన్‌లో ఉంటున్నాయి. ఒకవేళ మన ఫోన్‌ను ఎవరైనా కొట్టేసినా, ఎక్కడైనా పడిపోయినా పరిస్థితి ఏంటి..
Updated on: Sep 07, 2024 | 9:50 PM

ప్రస్తుతం ఫోన్‌కు అర్థం మారిపోయింది. బ్యాంక్ అకౌంట్ వివరాల నుంచి ఎన్నో వ్యక్తిగత వివరాల వరకు అన్నింటికి ఒక్కో యాప్ అందుబాటులోకి వచ్చేశాయి. మరి ఇలాంటి వ్యక్తిగత వివరాలు, ఆర్థిక వివరాలతో కూడిన యాప్స్ ఉన్న ఫోన్ ఎవరి చేతుల్లోకైనా వెళ్తే పరిస్థితి ఏంటి.?

ఫోన్‌ను దొంగలు దొంగలించినా, ఎక్కడైనా పడేసుకున్నా మన వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. మరి మన చేతిలో ఫోన్ లేకపోయినా.. పొగొట్టుకున్న ఫోన్‌లో యాప్స్‌ను డిలీట్ చేసుకోవడానిక ఒక అవకాశం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జీమెయిల్ అకౌంట్‌తో లింక్ అయిన గూగుల్ పే , ఫోన్‌పేతో పాటు మరెన్నో యాప్స్‌ను ఇట్టే అన్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇందు కోసం ముందుగా కంప్యూటర్‌లో గూగుల్ అకౌంట్‌తో లాగ్ ఇన్ అవ్వాలి.

ఆ తర్వాత గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లాలి. ప్లై స్టోర్‌పై రైట్ సైడ్‌లో కనిపించే ప్రొఫైల్‌పై క్లిక్ చేయాలి. అక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. దాంట్లో “మేనేజ్ యాప్స్ అండ్ డివైజ్” అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిన యాప్స్ అన్నీ కనిపిస్తాయి.

ఇప్పుడు మీరు ఏ యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారో దానిపై క్లిక్ చేసి.. “అన్‌ఇన్‌స్టాల్” బటన్‌పై క్లిక్ చేయాలి. అంతే మీ ఫోన్‌లో సదరు యాప్ వెంటనే అన్‌ఇన్‌స్టాల్ అవుతుంది.




