- Telugu News Photo Gallery Technology photos These are the best food in pregnancy those who suffered with low BP
Pregnancy: ప్రెగ్నెన్సీ సమయంలో బీపీ తక్కువగా ఉంటే ఏం తినాలి.? నిపుణులు ఏమంటున్నారంటే
ప్రెగ్నెన్సీ సమయంలో మహిళల ఆరోగ్యాల్లో ఎన్నో రకాల మార్పులు వస్తాయనే విషయం తెలిసిందే. హార్మోన్ల అసమతుల్యత వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి వాటిలో బీపీ లో అవ్వడం ఒకటి. గర్భిణీల్లో బీపీ తగ్గడం చాలా మందిలో కనిపిస్తుంది. అయితే తీసుకునే ఆహారం ద్వారా లోబీపీ సమస్యకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ ఫుడ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Sep 08, 2024 | 6:57 PM

కొన్ని రకల పండ్లను ఆహారంలో డైట్‌లో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ, అరటి, యాపిల్, పియర్ వంటి పండ్లలో ఉండే పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తపోటును సమతుల్యంగా ఉంచుతాయి.

లాక్టిక్ యాసిడ్ అనే ఈ బ్యాక్టీరియా మనుషుల్లో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. బటర్ మిల్క్‌లో విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. మజ్జిగ కేవలం చలవ చేయడం మాత్రమే కాదు.. ఇంకా ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుందని.. బరువు తగ్గడంలో ఉపయోపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

కోడి గుడ్లలో ప్రోటీన్, ఫోలేట్, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. లో బీపీ ఉన్న వారికి కోడి గుడ్లు దివ్యౌషధంగా చెప్పొచ్చు. వీటిలోని విటమిన్ B-12ఎర్ర రక్త కణాలను పెంచుతుంది. గుడ్లు తినడం వల్ల రక్తహీనత రాదు, తక్కువ బీపీ ఉన్నవారి బీపీ కూడా నార్మల్‌గా మారుతుంది. ఈ వివరాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Raisins

తులసి ఆకులు కూడా లో బీపీ సమస్య ఉన్న గర్భిణీలకు మంచి జరుగుతుంది. తులసి ఆకుల్లోని విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం, పాంతోతేనిక్ యాసిడ్ బీపీని నార్మల్‌గా ఉండేలా చేస్తుంది. తులసి ఆకుల రసంలో తేనె కలుపుకొని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

గర్భదారణ సమయంలో లోబీపీతో బాధపడే మహిళలు ఆకు కూరలను ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల రక్త హీనత సమస్య దూరమై బీపీ నార్మల్ స్టేజ్‌కి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.




