Petrol Vs Diesel Vs CNG: పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ.. ఇందులో ఏ కార్లలో ఎక్కువ కాలుష్యం!

Petrol Vs Diesel Vs CNG: మధ్యతరగతి భారతీయ కుటుంబాలు ప్రస్తుతం మూడు రకాల ఇంధన ఎంపికలతో కూడిన కార్లను మాత్రమే ఉపయోగిస్తున్నారు. వీటిలో పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రజలు తరచుగా పనితీరు, మైలేజ్, డిజైన్, ఫీచర్లు, ధర వంటి అంశాలకు ప్రాముఖ్యత ఇస్తారు. కానీ కాలుష్యం గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే కొత్త కారు కొనుగోలు చేసేటప్పుడు..

Petrol Vs Diesel Vs CNG: పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ.. ఇందులో ఏ కార్లలో ఎక్కువ కాలుష్యం!
Car Pollution
Follow us

|

Updated on: Sep 06, 2024 | 1:47 PM

Petrol Vs Diesel Vs CNG: మధ్యతరగతి భారతీయ కుటుంబాలు ప్రస్తుతం మూడు రకాల ఇంధన ఎంపికలతో కూడిన కార్లను మాత్రమే ఉపయోగిస్తున్నారు. వీటిలో పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రజలు తరచుగా పనితీరు, మైలేజ్, డిజైన్, ఫీచర్లు, ధర వంటి అంశాలకు ప్రాముఖ్యత ఇస్తారు. కానీ కాలుష్యం గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే కొత్త కారు కొనుగోలు చేసేటప్పుడు కాలుష్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ కార్ల కాలుష్య స్థాయిలలో వ్యత్యాసం వాటి ఇంధన రకం, ఉపయోగించే పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. ఈ కార్లలో ఏది ఎక్కువ కాలుష్యాన్ని వెదజల్లుతుందో తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: Spy Camera: వాష్‌రూమ్‌లో స్పై కెమెరా ఉంది.. ఇలా సులభంగా గుర్తించండి!

పెట్రోల్ కారు నుండి కాలుష్యం:

పెట్రోల్ ఇంజన్ వాహనాలు ముఖ్యంగా కార్బన్ డయాక్సైడ్ (CO2), కార్బన్ మోనాక్సైడ్ (CO)లను విడుదల చేస్తాయి. పెట్రోల్ కార్లు నైట్రోజన్ ఆక్సైడ్ (NOx), పార్టిక్యులేట్ మ్యాటర్ (PM) ఉద్గారాలను తగ్గిస్తాయి. అయితే గ్లోబల్ వార్మింగ్‌కు దోహదపడే అధిక మొత్తంలో CO2ని ఉత్పత్తి చేస్తాయి.

ఇవి కూడా చదవండి

డీజిల్ కారు నుండి కాలుష్యం:

పెట్రోల్ కార్ల కంటే డీజిల్ కార్లు ఎక్కువ నైట్రోజన్ ఆక్సైడ్లు (NOx), పార్టిక్యులేట్ మ్యాటర్ (PM) విడుదల చేస్తాయి. ఈ రెండు వాయువులు మానవ ఆరోగ్యానికి, పర్యావరణానికి హానికరం. డీజిల్ ఇంజన్లు సాధారణంగా ఇంధనాన్ని మరింత సమర్థవంతంగా ఉపయోగిస్తాయి. పెట్రోల్ కంటే తక్కువ CO2ని విడుదల చేస్తాయి. అయితే నైట్రోజన్ ఆక్సైడ్లు (NOx), పర్టిక్యులేట్ మ్యాటర్ (PM) స్థాయిలు పెట్రోల్‌ కంటే ఎక్కువ వాయు కాలుష్యాన్ని పెంచుతాయని టెక్‌ నిపుణులు చెబుతున్నారు.

CNG కారు నుండి కాలుష్యం:

సీఎన్‌జీ (CNG) మూడు ఎంపికలలో పరిశుభ్రమైన ఇంధనంగా పరిగణిస్తారు. సీఎన్‌జీ కార్లు పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌ల కంటే తక్కువ CO2, NOx, CO విడుదల చేస్తాయి. సీఎన్‌జీ కార్ల నుండి పర్టిక్యులేట్ మ్యాటర్ (PM), సల్ఫర్ డయాక్సైడ్ (SO2) ఉద్గారాలు దాదాపు చాలా తక్కువగా ఉన్నాయి. అందువల్ల అవి పర్యావరణానికి మంచివిగా పరిగణిస్తారు. డీజిల్ కార్లు అత్యధిక కాలుష్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా నైట్రోజన్ ఆక్సైడ్లు, పర్టిక్యులేట్‌లు. పెట్రోల్ కార్లు ఎక్కువ CO2, CO లను విడుదల చేస్తాయి. అయితే వాటి ఇతర కాలుష్య వాయువుల స్థాయిలు డీజిల్ కంటే తక్కువగా ఉంటాయి. CNG కార్లు తక్కువ కాలుష్యాన్ని కలిగిస్తాయి. అలాగే పర్యావరణానికి మంచి ఎంపికగా పరిగణిస్తారు. మొత్తంమీద కాలుష్యం పరంగా పెట్రోల్, డీజిల్ కార్ల కంటే CNG కార్లు మెరుగ్గా ఉంటాయని టెక్‌ నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ప్రజలకు భారీ షాక్‌.. పెట్రోల్‌, డీజిల్‌, విద్యుత్‌ ధరల పెంపు.. ఆ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి