ప్రజలకు భారీ షాక్‌.. పెట్రోల్‌, డీజిల్‌, విద్యుత్‌ ధరల పెంపు.. ఆ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ముందే నిత్యవసర వస్తువులతో పాటు అన్నింటి ధరలు మండిపోతుండటంతో సామాన్యులకు ఇబ్బందిగా మారుతుండటంతో ఇక్కడ మరోసారి పెట్రోల్‌, డీజిల్‌, విద్యుత్‌ బిల్లు పెరగడంతో సామాన్యులకు తీవ్ర భారంగా మారనుంది. గత నెలలుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కాని ఇప్పుడు ధరలు పెంచడంతో వాహనదారుల జేబుపై మరింత భారం పెరగనుంది..

ప్రజలకు భారీ షాక్‌.. పెట్రోల్‌, డీజిల్‌, విద్యుత్‌ ధరల పెంపు.. ఆ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
Petrol Price
Follow us

|

Updated on: Sep 06, 2024 | 10:13 AM

పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను పెంచింది. లీటర్ పెట్రోల్‌పై 61 పైసలు, డీజిల్‌పై 92 పైసలు వ్యాట్ పెరిగింది. చండీగఢ్‌లో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తర్వాత డీజిల్ ధర లీటరుకు 92 పైసలు, పెట్రోల్ ధర 61 పైసలు పెరిగింది. పంజాబ్‌లో గతంలో లీటరు పెట్రోల్ ధర రూ. 97.03 ఉండగా, ఇప్పుడు లీటరుకు రూ. 97.64 అవుతుంది. అదే విధంగా లీటరుకు రూ.87.34గా ఉన్న డీజిల్ ధర ఇప్పుడు రూ.88.26కి చేరనుంది. వ్యాట్ పెంచడం ద్వారా రూ.545 కోట్ల ఆదాయం సమకూరుతుందని పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ చీమా తెలిపారు. హిమాచల్, రాజస్థాన్, హర్యానా కంటే పంజాబ్‌లో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తక్కువగా ఉందని ఆయన అన్నారు. దీని ద్వారా వచ్చే డబ్బును పంజాబ్ అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేస్తామని చీమా చెప్పారు.

రూ.3 యూనిట్ల విద్యుత్ సబ్సిడీ కూడా నిలిచిపోయింది ద్రవ్యోల్బణం నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం ప్రజలకు మరో షాక్ ఇచ్చింది. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించిన విద్యుత్‌ సబ్సిడీ పథకాన్ని రద్దు చేస్తూ కేబినెట్‌ సమావేశంలో ప్రభుత్వం ప్రకటించింది. దీని కింద ఏడు కిలోవాట్ల వరకు లోడ్ ఉన్న ఇళ్లకు యూనిట్‌కు రూ.3 చొప్పున ఉపశమనం కల్పించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం దానిని రద్దు చేసింది. అయితే ప్రతి ఇంటికీ 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే పథకం మునుపటిలా కొనసాగుతుందని ప్రభుత్వం వెల్లడించింది.

పంజాబ్ ఇంధన ధరల పెంపుతో పాటు విద్యుత్ సబ్సిడీ పథకాన్ని రద్దు చేయాలనే నిర్ణయం తీసుకుంది. కేంద్రం నిధుల కోతతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయాలను తీసుకున్నట్లు చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం పంజాబ్ గ్రామీణాభివృద్ధి నిధి, ఇతర నిధులను ఇంకా విడుదల చేయలేదు. దీని కారణంగా అభివృద్ధి కుంటు పడుతోంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: PM Kisan: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 18వ విడత డబ్బులు ఎప్పుడో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి