AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ration Card: రేషన్ కార్డులు ఎన్ని రకాలు ఉంటాయి? ఎవరికి ఎలాంటి కార్డ్‌ ఇస్తారు?

రేషన్ కార్డుదారుల కుటుంబాలకు ప్రభుత్వం తక్కువ ధరకు బియ్యం, పప్పులు, నూనె, గోధుమలు, చక్కెర వంటి నిత్యావసర సరుకులను అందజేస్తోంది. ఇప్పుడు అన్ని శాఖలను డిజిటలైజేషన్ చేసి రేషన్ కార్డులు కూడా స్మార్ట్ కార్డుల రూపంలోకి వచ్చాయి. అయితే రేషన్‌ కార్డుల్లో కూడా రకరకాలుగా ఉంటాయన్న విషయం మీకు తెలుసా? ఏయే కార్డు ఎవరికి అందజేస్తారో తెలుసా?

Ration Card: రేషన్ కార్డులు ఎన్ని రకాలు ఉంటాయి? ఎవరికి ఎలాంటి కార్డ్‌ ఇస్తారు?
Subhash Goud
|

Updated on: Sep 05, 2024 | 1:52 PM

Share

భారతదేశంలోని ప్రతి ఇంటికి రేషన్ కార్డు జారీ అవుతుంది. ఈ రేషన్ కార్డులో కుటుంబ సభ్యులందరి పేర్లు ఉంటాయి. రేషన్ కార్డుదారుల కుటుంబాలకు ప్రభుత్వం తక్కువ ధరకు బియ్యం, పప్పులు, నూనె, గోధుమలు, చక్కెర వంటి నిత్యావసర సరుకులను అందజేస్తోంది. ప్రస్తుతం అయితే బియ్యం, ఇతర వస్తువులు ఉచితంగానే అందజేస్తున్నారు. ఇప్పుడు అన్ని శాఖలను డిజిటలైజేషన్ చేసి రేషన్ కార్డులు కూడా స్మార్ట్ కార్డుల రూపంలోకి వచ్చాయి. దీని ప్రకారం రేషన్ కార్డుకు కుటుంబ సభ్యుల వేలిముద్రలు పొందుపరుస్తారు. రేషన్ దుకాణానికి వెళ్లిన ప్రతిసారీ వేలిముద్రను నమోదు చేయడం ద్వారా మాత్రమే రేషన్‌ తీసుకోవచ్చు. ఇలా ప్రజాజీవితంలో రేషన్ దుకాణాలు కీలకపాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఎన్ని రకాల రేషన్ కార్డులు ఉన్నాయి? ఎవరికి ఏయే రకాల కార్డులు ఇస్తారో మీకు తెలుసా? అయితే పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: Gold Rates: మహిళలకు పండగే.. అప్పుడు రికార్డ్‌.. ఇప్పుడు పతనం.. రూ.3,722 తగ్గింపు

భారతదేశంలో జారీ చేసిన రేషన్ కార్డుల రకాలు:

  1. భారతదేశంలో వివిధ రకాల రేషన్ కార్డులు జారీ అవుతుంటాయి. వాటిలో ప్రతి ఒక్కటి ఒక్కో అర్హత ఆధారంగా జారీ అవుతాయి. దీని ప్రకారం, ప్రతి విభాగానికి వారి ఆర్థిక స్థితి ఆధారంగా రేషన్ కార్డులు జారీ చేస్తారు.
  2. అంత్యోదయ అన్న యోజన (AAY): భారతదేశంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అంత్యోదయ అన్న యోజన రేషన్ కార్డులు జారీ చేస్తారు. దీని ప్రకారం వార్షిక ఆదాయం రూ.15,000 లోపు ఉన్న కుటుంబాలకు ఈ రేషన్ కార్డులు ఇస్తారు.
  3. ఇవి కూడా చదవండి
  4. BPL రేషన్ కార్డు: ఈ BPL రేషన్ కార్డు భారతదేశంలోని దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఇస్తారు. దీని ప్రకారం వార్షిక ఆదాయం రూ.24,200 ఉన్న కుటుంబాలకు ఈ రేషన్ కార్డు ఇస్తారు. దీని అర్థం BPL – దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు అని అర్థం.
  5. APL రేషన్ కార్డు: దారిద్య్రరేఖకు ఎగువన ఉన్న వారికి ఈ APL రేషన్ కార్డు అందజేస్తారు. దీని ప్రకారం, వార్షిక ఆదాయం రూ.1,00,000 ఉన్న కుటుంబాలకు ఈ రేషన్ కార్డు ఇస్తారు. ఇది APL అంటే దారిద్య్ర రేఖకు ఎగువన సూచిస్తుంది. దారిద్య్రరేఖకు ఎగువన ఉన్న వ్యక్తుల ఈ కార్డులను జారీ చేస్తారు.
  6. AAY , BPL రేషన్ కార్డుల మాదిరిగా కాకుండా ఈ APL కార్డు భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇచ్చే రేషన్ కార్డు. కానీ, ఏఏవై, బీపీఎల్ రేషన్ కార్డులు అలా కాదు. కార్డులకు సబ్సిడీ ఆహార పదార్థాలను అందజేస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి