Taxpayers: పన్ను కట్టేవారిలో వీరే తోపులు.. ఫస్ట్ ప్లేస్‌లో ఎవరున్నారో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

ప్రభుత్వాలకు పెద్ద ఆదాయం అంటే ట్యాక్స్‌. ప్రతి ఏడాది ఆదాయపు పన్ను ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతుంటుంది. మన దేశంలో కోట్లాది రూపాయలుగా పన్ను చెల్లించే వ్యక్తులు ఎందరో ఉన్నారు. అలాంటి వారు కోట్లల్లో ఆదాయపు పన్ను చెల్లిస్తుంటే వారి సంపాదన ఏ మేర ఉంటుందో ఊహకు అంతనంతగా ఉంటుంది..

Taxpayers: పన్ను కట్టేవారిలో వీరే తోపులు.. ఫస్ట్ ప్లేస్‌లో ఎవరున్నారో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
Taxpayers
Follow us

|

Updated on: Sep 05, 2024 | 10:30 AM

ప్రభుత్వాలకు పెద్ద ఆదాయం అంటే ట్యాక్స్‌. ప్రతి ఏడాది ఆదాయపు పన్ను ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతుంటుంది. మన దేశంలో కోట్లాది రూపాయలుగా పన్ను చెల్లించే వ్యక్తులు ఎందరో ఉన్నారు. అలాంటి వారు కోట్లల్లో ఆదాయపు పన్ను చెల్లిస్తుంటే వారి సంపాదన ఏ మేర ఉంటుందో ఊహకు అంతనంతగా ఉంటుంది. బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ బాలీవుడ్, స్పోర్ట్స్‌ రంగం నుంచి సెలబ్రిటీల వరకు పన్ను చెల్లింపుదారులలో మొదటి స్థానంలో ఉన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో షారుక్ ఖాన్ రూ.92 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.80 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించిన తమిళ నటుడు విజయ్ రెండో స్థానంలో నిలిచారు. ఆదాయపు పన్ను చెల్లింపులో క్రీడాకారుల్లో క్రికెటర్ విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉండగా, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రెండో స్థానంలో నిలిచాడు. మరి ఎవరె ఎంత పన్ను చెల్లించారో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

బాలీవుడ్ సెలబ్రిటీ పన్ను చెల్లింపుదారులు:

ఫార్చ్యూన్ ఇండియా 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రముఖ పన్ను చెల్లింపుదారుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం.. షారుక్ ఖాన్ రూ.92 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించారు. రూ.80 కోట్ల పన్ను చెల్లింపుతో నటుడు విజయ్ రెండో స్థానంలో రూ.75 కోట్ల ఆదాయపు పన్ను చెల్లింపుతో సల్మాన్ ఖాన్ మూడో స్థానంలో నిలిచారు. బిగ్ బి అంటే అమితాబ్ బచ్చన్ 2023-24 ఆదాయపు పన్ను రూపంలో రూ.71 కోట్లు చెల్లించారు. అజయ్ దేవగన్ రూ.42 కోట్లు, రణబీర్ కపూర్ రూ.36 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించారు.

హృతిక్ రోషన్ 28 కోట్లు, కపిల్ శర్మ 26 కోట్లు, కరీనా కపూర్ 20 కోట్లు, షాహిద్ కపూర్ 14 కోట్లు, కియారా అద్వానీ 12 కోట్లు, కత్రినా కైఫ్ 11 కోట్లు చెల్లించారు. ఈ జాబితాలో పంకజ్ త్రిపాఠి కూడా చేరారు. 11 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించాడు. అమీర్ ఖాన్ రూ.11 కోట్లు, మలయాళ సినీ నటుడు మోహన్ లాల్ రూ.14 కోట్లు, అల్లు అర్జున్ రూ.14 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించారు.

సెలబ్రిటీ పన్ను చెల్లింపుదారులలో క్రికెటర్లు

క్రికెటర్లలో పెద్ద సంఖ్యలో సెలబ్రిటీ పన్ను చెల్లింపుదారులు కూడా ఉన్నారు. 66 కోట్ల పన్ను చెల్లింపుతో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. మహి అంటే మహేంద్ర సింగ్ ధోనీ 38 కోట్ల రూపాయల ఆదాయపు పన్ను చెల్లించారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.28 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించారు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా రూ.13 కోట్లు, రిషబ్ పంత్ రూ.10 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..