AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

iPhone: ఐఫోన్‌లో మొదట తలెత్తే సమస్యలు ఏంటో తెలుసా? ముందే జాగ్రత్త పడితే బెటర్‌!

ఐఫోన్ ఈ రోజుల్లో చాలా ట్రెండ్‌లో ఉంది. మునుపటితో పోలిస్తే ఇప్పుడు మీరు చాలా మంది వ్యక్తుల చేతుల్లో ఐఫోన్‌ను కనిపిస్తుంటంఉది. ఈఎంఐ, సెకండ్ హ్యాండ్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను పొందడం కూడా దీనికి కారణం కావచ్చు. ఐఫోన్‌ను చాలా కాలంగా ఉపయోగిస్తున్న వారికి దాని ప్రతికూలతలు ఎంటో బాగా తెలుసు. అయితే ఐఫోన్ లేని వ్యక్తులు కనీసం ఒక్కసారైనా ఐఫోన్‌ను..

iPhone: ఐఫోన్‌లో మొదట తలెత్తే సమస్యలు ఏంటో తెలుసా? ముందే జాగ్రత్త పడితే బెటర్‌!
Iphone
Subhash Goud
|

Updated on: Sep 05, 2024 | 12:43 PM

Share

ఐఫోన్ ఈ రోజుల్లో చాలా ట్రెండ్‌లో ఉంది. మునుపటితో పోలిస్తే ఇప్పుడు మీరు చాలా మంది వ్యక్తుల చేతుల్లో ఐఫోన్‌ను కనిపిస్తుంటంఉది. ఈఎంఐ, సెకండ్ హ్యాండ్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను పొందడం కూడా దీనికి కారణం కావచ్చు. ఐఫోన్‌ను చాలా కాలంగా ఉపయోగిస్తున్న వారికి దాని ప్రతికూలతలు ఎంటో బాగా తెలుసు. అయితే ఐఫోన్ లేని వ్యక్తులు కనీసం ఒక్కసారైనా ఐఫోన్‌ను కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. ఐఫోన్ ఎదుర్కొంటున్న అత్యంత సాధారణ సమస్యల గురించి తెలుసుకుందాం.

ఐఫోన్‌లో మొదట ఇవి దెబ్బతింటాయి:

ఐఫోన్ కొత్తది అయినప్పుడు అది చాలా బాగా పని చేస్తుంది. కానీ నెలల తర్వాత దానికి సమస్యలు మొదలవుతాయి. ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు సరిగ్గా పనిచేసిన తర్వాత ఐఫోన్ విస్మరించలేని కొన్ని సమస్యలు తలెత్తుతాయి. మొదటి సమస్యలలో బ్యాటరీ. స్టోరేజ్, హీటింగ్, ఫేస్ ID, డెప్త్ కెమెరా, ఛార్జింగ్ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు తలెత్తితే వెంటనే సరి చేసుకోవడం మంచిది. లేకుంటే మీ ఖర్చు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది.

ఈ విధంగా ఆలోచించండి – మీరు మీ ఐఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత ఇంటి నుండి బయలుదేరి కొంత సమయం తర్వాత వీడియో కాల్ చేసి, 20 నిమిషాల కంటే ఎక్కువసేపు మాట్లాడినట్లయితే, మీ బ్యాటరీ 100% నుండి 60%కి పడిపోతుంది. అలాగే ఫోన్ వేడెక్కుతుంది. మీరు కెమెరాను కాసేపు ఉపయోగిస్తే అది 20-30% తగ్గుతుంది. మీరు ఎండలో వీడియోలు, ఫోటోలు షూట్ చేస్తుంటే, ఫోన్ చాలా వేడెక్కుతుంది.

ఇది కూడా చదవండి: Taxpayers: పన్ను కట్టేవారిలో వీరే తోపులు.. ఫస్ట్ ప్లేస్‌లో ఎవరున్నారో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

మీకు బ్యాటరీ సమస్య ఉంటే మీరు ఫోన్‌ను పదేపదే ఛార్జ్ చేస్తారు. దాని కారణంగా బ్యాటరీ త్వరగా పాడైపోయే ప్రమాదం ఉందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. దాన్ని సరిదిద్దడానికి మీరు చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీరు ఫోటో-వీడియోలను రూపొందించడానికి ఇష్టపడినప్పుడు స్టోరేజీ సమస్య ఎక్కువగా ఉంటుంది. నిజానికి iPhoneలో కూడా ఫోటో లేదా వీడియో ఎక్కువ సైజులు కూడుకున్నవి ఉంటాయి. ఇవి ఎంబీలు, జీబీలలో కూడా ఉండవచ్చు. దీని కారణంగా స్టోరేజ్ త్వరగా ఫుల్‌ అవుతుంటుంది. దీన్ని వదిలించుకోవాలంటే క్లౌడ్ స్టోరేజీని విడిగా కొనుగోలు చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు iPhone Face IDని ఒకేసారి తీసుకోదు. ఎందుకంటే.. దాన్ని పరిష్కరించడానికి మీరు Apple Storeకి వెళ్లాలి.

వినియోగదారులు ఫిర్యాదు దీనిపైనే..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని తానియా లాంబా పలు విషయాలు వెల్లడించారు. తాను ఐఫోన్‌ను 2 సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. సాధారణంగా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ తర్వాత ఫోన్ బాగా పనిచేయడం ప్రారంభిస్తుంది. అలాగే బగ్‌లు పరిష్కారం అవుతాయి. కానీ మీరు ఐఫోన్‌ను అప్‌డేట్ చేసినప్పుడు కాలక్రమేణా దాని కెమెరా పనితీరు కూడా ఒక్కోసారి పని చేయకపోవచ్చు అని అన్నారు. హీటింగ్ సమస్యపై గ్రాఫిక్ డిజైనర్ దీపక్ పాల్‌ మాట్లాడుతూ.. మీరు ఐఫోన్‌లో వీడియో ఎడిటింగ్ లేదా ట్రేడింగ్ అప్లికేషన్‌లను నిరంతరం రన్ చేస్తే ఫోన్‌ త్వరగా హీటైపోతుంది. దీని వల్ల ఫోన్‌లో సమస్యలు తలెత్తవచ్చు.

ఇది కూడా చదవండి: Indian Railways: రైల్వే ట్రాక్ పక్కన W/L అనే బోర్డులు ఎందుకు ఏర్పాటు చేస్తారు? వీటి అర్థం ఏంటి?

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..