- Telugu News Photo Gallery Technology photos Indian Railways: what does wl signboard means in railway crossing all you need to know about
Indian Railways: రైల్వే ట్రాక్ పక్కన W/L అనే బోర్డులు ఎందుకు ఏర్పాటు చేస్తారు? వీటి అర్థం ఏంటి?
భారతీయ రైల్వే నెట్‌వర్క్ దాదాపు 68 వేల కిలోమీటర్లపైగా ఉంది. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు రైళ్ల ద్వారా ప్రయాణిస్తుంటారు. మీరు కూడా ఏదో ఒక సమయంలో భారతీయ రైల్వేలో ప్రయాణించి ఉండవచ్చు. మీరు ప్రయాణంలో, రైల్వే స్టేషన్‌లో అనేక రైల్వే చిహ్నాలను చూసి ఉండాలి. అలాగే ట్రాక్ పక్కన వివిధ రకాల బోర్డులు చైసి ఉంటారు. వాటి అర్థం ఏంటో తెలుసా?..
Updated on: Sep 05, 2024 | 12:24 PM

రైల్వేలో ప్రయాణిస్తున్నప్పుడు ట్రాక్ పక్కన మీకు అనేక సైన్ బోర్డులు కనిపిస్తాయి. ఈ అనేక బోర్డులపై స్టేషన్ పేరు రాసి ఉండటం చూసే ఉంటారు. అలాగే మీరు ప్రయాణిస్తున్నప్పుడు ట్రాక్ పక్కన రకరకాల బోర్డులు కనిపిస్తుండటం చూసే ఉంటారు. అవి ఎందుకు ఉంటాయి..? వాటిపై రాసిన లెటర్స్ ఏంటి ? అనే విషయం మీకు తెలుసా? ఉంది. ట్రాక్ పక్కన మీకు తెలియని కొన్ని సిగ్నల్స్ ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.

C/FA, W/L బోర్డులు తరచుగా రైల్వే ట్రాక్‌ల వెంట అమర్చి ఉంటయి. కానీ, దీని అర్థం ఏమిటి? దాని ఉపయోగం ఏమిటి ? అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

W/L పసుపు కలర్ బోర్డ్‌లో రాసి ఉంటుంది. అంటే విజిల్/లెవల్ క్రాసింగ్ అని అర్థం. అంటే విజిల్/గేట్.

పసుపు బోర్డుపై C/F , W/L రాసినవి రైలు లోకో పైలట్ కోసం. లోకో పైలట్ ఈ ప్రాంతానికి చేరుకున్న వెంటనే అతను రైలు హారన్ మోగించాలని ఈ సైన్ బోర్డు లోకో పైలట్‌కు సిగ్నల్ ఇస్తుంది. ఈ బోర్డు సాధారణంగా రైల్వే క్రాసింగ్‌కు 250 నుండి 300 మీటర్ల వరకు ఈ సైన్ బోర్డులు అమర్చబడి ఉంటుంది.

ప్రపంచంలో రైల్వే నెట్‌వర్క్‌లో భారతదేశం నాల్గవ స్థానంలో, ఆసియాలో మొదటి స్థానంలో ఉంది. భారతదేశంలో రైల్వే ట్రాక్‌లు 68 వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉన్నాయి.




