పోకో ఎం6 ప్లస్ ఫోన్ 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.79 అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్‌తో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో వస్తుంది. 550 నిట్స్ బ్రైట్‌నెస్‌తో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఏఈ చిప్‌సెట్ ద్వారా ఆధారంగా పని చేసే ఈ ఫోన్ గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ టాస్క్‌లను నిర్వహించడానికి అనువుగా వస్తుంది. 6 జీబీ + 128 జీబీ, 8 జీబీ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్స్‌లో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంటుంది. 5,030ఎంఏహెచ్ బ్యాటరీతో పని చేసే ఈ ఫోన్ రూ.15 వేల కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉండే ది బెస్ట్ ఫోన్ అని నిపుణులు చెబుతున్నారు.