AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 18వ విడత డబ్బులు ఎప్పుడో తెలుసా?

దేశ రైతుల కోసం ప్రధాన నరేంద్ర మోడీ అనేక పథకాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఆర్థిక సాయంగా పీఎం కిసాన్‌ స్కీమ్‌ను అందజేస్తుంది. అయితే ఇప్పటి వరకు రైతులు 17వ విడత వరకు అందుకున్నారు. ఇప్పుడు 18వ విడత కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వెలువడుతున్న సమాచారం ప్రకారం చూస్తే 18వ విడత త్వరలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది..

PM Kisan: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 18వ విడత డబ్బులు ఎప్పుడో తెలుసా?
Subhash Goud
|

Updated on: Sep 06, 2024 | 8:27 AM

Share

PM Kisan: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం 18వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్త. నివేదికల ప్రకారం, ఈ విడతను అక్టోబర్ 2024లో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని సమాచారం. అంతకుముందు 17వ విడతను జూన్ 2024లో ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. వారణాసిలోని 9.26 కోట్ల మందికి పైగా రైతులకు 17వ విడతగా రూ.21,000 కోట్లకు పైగా ప్రధాని మోదీ విడుదల చేశారు. ఈ విడతను ఉత్తరప్రదేశ్‌లో జూన్ 18, 2024న విడుదల చేయగా, 16వ విడత ఈ సంవత్సరం ఫిబ్రవరిలో విడుదలైంది.

పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలు:

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000, అంటే సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక సహాయం అందజేస్తారు. ఈ మొత్తాన్ని ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి వంటి మూడు వాయిదాలలో రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది కేంద్రం. ఈ పథకాన్ని 2019 మధ్యంతర బడ్జెట్‌లో అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. అలాగే తరువాత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇది ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) పథకంగా మారింది.

ఇవి కూడా చదవండి

వాయిదా కోసం e-KYC అవసరం

ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు రైతులు తమ e-KYC ప్రక్రియను పూర్తి చేయాలి. పథకం అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, PMKISANలో నమోదు చేసుకున్న రైతులకు eKYC తప్పనిసరి. OTP-ఆధారిత eKYC PMKISAN పోర్టల్‌లో అందుబాటులో ఉంది. లేదా బయోమెట్రిక్ eKYC కోసం సమీప CSC కేంద్రాలను సంప్రదించవచ్చు.

లబ్ధిదారులు స్థితిని తనిఖీ చేయండిలా..

  • ముందుగా pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ‘నో యువర్ స్టేటస్’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, ‘డేటా పొందండి’ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  • మీ స్థితి కనిపిస్తుంది.

లబ్ధిదారుల జాబితాలో పేరును తనిఖీ చేయండి:

  • PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ www.pmkisan.gov.inని సందర్శించండి.
  • ‘బెనిఫిషియరీ లిస్ట్’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
  • రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామాన్ని ఎంచుకోండి.
  • ‘గెట్ రిపోర్ట్’పై క్లిక్ చేయండి.
  • దీని తర్వాత లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది. మరింత సమాచారం కోసం హెల్ప్‌లైన్ నంబర్‌లు 155261, 011-24300606లను సంప్రదించండి.

PM కిసాన్ యోజన కోసం ఎలా దరఖాస్తు చేయాలి:

  • ముందుగా pmkisan.gov.in వెబ్‌సైట్‌ని సందర్శించండి.
  • ‘కొత్త రైతు నమోదు’పై క్లిక్ చేసి, ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.
  • PM-కిసాన్ దరఖాస్తు ఫారమ్ 2024లో కోరిన సమాచారాన్ని నమోదు చేయండి. దానిని సేవ్ చేయండి. అలాగే ప్రింటవుట్ కూడా తీసుకోండి. ఈ పథకానికి సంబంధించిన తాజా సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

ఇది కూడా చదవండి: Gold Rates: మహిళలకు పండగే.. అప్పుడు రికార్డ్‌.. ఇప్పుడు పతనం.. రూ.3,722 తగ్గింపు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి