AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cow Dung Gas: ఆవుపేడతో కార్లకు గ్యాస్ ఉత్పత్తి.. మారుతీ సుజుకీ వినూత్న ప్రయోగం

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తన కార్ల ద్వాారా వెలువడే కర్బన ఉద్ఘారాలను తగ్గించడానికి వివిధ పరిశోధనలు చేస్తుంది. ప్రస్తుతం ఆవుపేడ ద్వారా కార్ల నుంచి వెలువడే సీఓ2 తగ్గించడానికి బయోగ్యాస్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Cow Dung Gas: ఆవుపేడతో కార్లకు గ్యాస్ ఉత్పత్తి.. మారుతీ సుజుకీ వినూత్న ప్రయోగం
Maruthi
Nikhil
|

Updated on: Jan 30, 2023 | 10:21 AM

Share

పురాణాల్లో ఆవుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గోమాత అంటూ భక్తులు పూజలు చేస్తుంటారు. అయితే ఈ నమ్మకంతో ఆవు పాలు, పెరుగు, నెయ్యి గో మూత్రం అంటూ గో ఆధారిత ప్రోడక్ట్స్ ఇప్పుడు మార్కెట్ లో అమ్ముతున్నారు. ఆవు పేడను మాత్రం ప్రకృతి వ్యవసాయం చేసుకునే వారు వాడుతున్నారు. అయితే ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తన కార్ల ద్వాారా వెలువడే కర్బన ఉద్ఘారాలను తగ్గించడానికి వివిధ పరిశోధనలు చేస్తుంది. ప్రస్తుతం ఆవుపేడ ద్వారా కార్ల నుంచి వెలువడే సీఓ2 తగ్గించడానికి బయోగ్యాస్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా బయోగ్యాస్, ఇథనాల్ ద్వారా నడిచే వాహనాలకు ఈ పరిశోధనలు బాగా ఉపయోగపడతాయని నిపుణులు పేర్కొంటున్నారు. 

మారుతీ సుజుకీ భవిష్యత్ వాహనాలంటూ కేవలం ఈవీలపై తన దృష్టి అంతా పెట్టకుండా సీఎన్ జీ, ఇథనాల్, మిశ్రమ ఇందనాల ద్వారా కార్బన్ న్యూట్రల్ అంతర్గత దహన ఇంజిన్ వాహనాలను అందించేందుకు కృషి చేస్తుంది. దీని కోసం ముఖ్యంగా బయోగ్యాస్ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎందుకంటే భారత్ లోని గ్రామీణ ప్రాంతాల్లో దొరికే ఆవుపేడ ద్వారా బయోగ్యాస్ ఉత్పత్తి చేయడం సులువని కంపెనీ భావిస్తుంది. ఈ బయోగ్యాస్ సీఎన్ జీ వాహనాలకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న సీఎన్ జీ వాహనాల్లో 70 శాతం వాహనాలు మారుతీ సుజుకీ కంపెనీకి చెందినవే. కేవలం బయోగ్యాస్ ఉత్పత్తి భారత్ కే పరిమితం చేయకుండా భవిష్యత్ లో ఆఫ్రికన్, ఇతర ఆసియా దేశాల్లోని వ్యవసాయ ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రణాళిక రూపొందిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత సంవత్సరంలో బయోగ్యాస్ ఉత్పత్తి కోసం కంపెనీ నేషనల్ డైరీ డెవలప్ మెంట్ బోర్డుతో ఎంఓయూ కుదుర్చుకుంది. తర్వాత ఎన్ డీడీబీ, ఎస్ఎంసీ, గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ విభాగమైన బనాస్ డైరీ మధ్య త్రైపాక్షిక ఒప్పందం మేరకు 2024 నుంచి బయోగ్యాస్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

వాళ్లకు ఈజీగా ఛాన్స్‌లు.. నాకు మాత్రం కష్టమే: థమన్
వాళ్లకు ఈజీగా ఛాన్స్‌లు.. నాకు మాత్రం కష్టమే: థమన్
డిసెంబర్‌ 31 చివరి గడువు.. లేకుంటే రేషన్‌ సరుకులు బంద్‌!
డిసెంబర్‌ 31 చివరి గడువు.. లేకుంటే రేషన్‌ సరుకులు బంద్‌!
ఎస్బీఐ కాదు.. దేశంలో బెస్ట్ బ్యాంక్ ఇదే.. మీరు అస్సలు ఊహించలేరు..
ఎస్బీఐ కాదు.. దేశంలో బెస్ట్ బ్యాంక్ ఇదే.. మీరు అస్సలు ఊహించలేరు..
జుట్టు రాలుతోందా..? ఈ మ్యాజిక్ జ్యూస్ తాగితే వెంటనే ఆగిపోతుంది..
జుట్టు రాలుతోందా..? ఈ మ్యాజిక్ జ్యూస్ తాగితే వెంటనే ఆగిపోతుంది..
మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది?
మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది?
బాలయ్య 'అఖండ 2' మూవీలో శివుడిగా నటించింది ఎవరో తెలుసా?
బాలయ్య 'అఖండ 2' మూవీలో శివుడిగా నటించింది ఎవరో తెలుసా?
గెలిపించేస్తాడు..వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ధీమా
గెలిపించేస్తాడు..వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ధీమా
ఎంతకు తెగించ్చార్రా.. బిగ్‌బాస్‌లో దుమారం..
ఎంతకు తెగించ్చార్రా.. బిగ్‌బాస్‌లో దుమారం..
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ డబ్బు ఎవరు కట్టాలి.. రూల్స్..
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ డబ్బు ఎవరు కట్టాలి.. రూల్స్..
పోలింగ్ రోజే వెంటాడిని మృత్యువు.. స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి మృతి
పోలింగ్ రోజే వెంటాడిని మృత్యువు.. స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి మృతి