AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ డబ్బు ఎవరు కట్టాలి.. రూల్స్ ఏం చెబుతున్నాయంటే..?

Loans: డబ్బు అవసరం రాగానే టక్కున గుర్తొచ్చేది లోన్. ప్రతీ ఒక్కరు ఏదో ఒక సమయంలో లోన్ తీసుకుంటున్నారు. లోన్ తీసుకునేముందు పక్కాగా అన్ని విషయాలు తెలుసుకోవాలి.. లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. ఆ లోన్ మాఫీ అవుతుందా..? లేక ఫ్యామిలీ మెంబర్స్ కట్టాలా..? అనేది తెలుసుకుందాం..

లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ డబ్బు ఎవరు కట్టాలి.. రూల్స్ ఏం చెబుతున్నాయంటే..?
Loan After Death
Krishna S
|

Updated on: Dec 14, 2025 | 11:35 AM

Share

ఏ చిన్న అవసరం వచ్చినా లోన్ తీసుకోవడం ఈ కాలంలో కామన్ అయిపోయింది. హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ బకాయిలు.. ఇలా పలు రకాల రుణాలు మన జీవితంలో భాగమయ్యాయి. అయితే ఒకవేళ లోన్ తీసుకున్న వ్యక్తి అనుకోకుండా మరణిస్తే.. ఆ అప్పు మాఫీ అవుతుందా? లేక కుటుంబ సభ్యులు చెల్లించాల్సి వస్తుందా? అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

పర్సనల్ లోన్స్

పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ బకాయిలు వంటివి అన్‌సెక్యూర్డ్ లోన్స్ జాబితాలోకి వస్తాయి. అంటే ఈ రుణాలకు హామీగా ఎలాంటి ఆస్తి ఉండదు. లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే, ఈ రుణం చెల్లించమని బ్యాంకు ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను లేదా గ్యారంటర్‌ను బలవంతం చేయదు. ఇవి అన్‌సెక్యూర్డ్ రుణాలు కాబ, రుణగ్రహీత మరణానంతరం బ్యాంకులు సాధారణంగా వీటిని రికవరీ చేయలేవు. ఈ బకాయిలు రద్దు అయ్యే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

హోమ్ లోన్స్

హోమ్ లోన్స్ సెక్యూర్డ్ రుణాల కిందకు వస్తాయి. ఎందుకంటే ఇంటి ఆస్తిని హామీగా పెట్టి ఈ రుణాలు తీసుకుంటారు. సాధారణంగా హోమ్ లోన్‌కు అప్లికెంట్‌తో పాటు కో-అప్లికెంట్ ఉంటారు. ప్రధాన రుణగ్రహీత మరణిస్తే, లోన్ తిరిగి చెల్లించే పూర్తి బాధ్యత కో-అప్లికెంట్‌పై పడుతుంది. కో-అప్లికెంట్ వెంటనే బ్యాంకుకు తెలియజేయాలి. అప్పుడు లోన్‌ను మరణించిన వ్యక్తి పేరుపై నుంచి తొలగించి, కో-అప్లికెంట్ పేరు మీదకు బదిలీ చేస్తారు. ఒకవేళ కో-అప్లికెంట్ బకాయిలు చెల్లించలేకపోతే, ఆ ఆస్తిని స్వాధీనం చేసుకునే హక్కు బ్యాంకుకు ఉంటుంది.

ఇన్సూరెన్స్ ఉంటే లాభమేంటి?

లోన్ తీసుకున్న మరణించినప్పుడు కుటుంబానికి ఆర్థిక భారం తగ్గించడానికి లోన్ ఇన్సూరెన్స్ కవర్ చాలా ఉపయోగపడుతుంది. చాలా బ్యాంకులు హోమ్ లోన్ తీసుకునేటప్పుడే ఈ ఇన్సూరెన్స్ ఆప్షన్‌ను అందిస్తాయి. రుణగ్రహీత మరణిస్తే, ఇన్సూరెన్స్ కంపెనీ మిగిలిన లోన్ బకాయిలను చెల్లిస్తుంది. దీనివల్ల కో-అప్లికెంట్ లేదా కుటుంబ సభ్యులపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదు. పర్సనల్ లోన్స్ విషయంలో ఇలాంటి ఇన్సూరెన్స్ కవర్ ఆప్షన్లు తక్కువగా ఉంటాయి. అందుకే హోమ్ లోన్ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ కవర్ గురించి తెలుసుకోవడం దాన్ని ఎంచుకోవడం తెలివైన పని.

లోన్ తీసుకున్న వ్యక్తి మరణించినప్పుడు అది సెక్యూర్డ్ లోనా లేక అన్‌సెక్యూర్డ్ లోనా అనే దానిపైనే నిబంధనలు ఆధారపడి ఉంటాయి. భవిష్యత్తులో కుటుంబ సభ్యులకు ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలంటే రుణగ్రహీతలు ఈ నిబంధనలను ముందుగానే తెలుసుకోవడం, సరైన ఇన్సూరెన్స్ పాలసీలను ఎంచుకోవడం అత్యంత ముఖ్యం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌ షాక్.. లొంగిపోయిన 63 మంది నక్సలైట్స్!
మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌ షాక్.. లొంగిపోయిన 63 మంది నక్సలైట్స్!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. విద్యుత్ ఛార్జీలు తగ్గింపు.. ఎంతంటే
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. విద్యుత్ ఛార్జీలు తగ్గింపు.. ఎంతంటే
ఓరీ దేవుడో.. సింగిల్ బెడ్‌రూం ఫ్లాట్ అద్దె నెలకు రూ. 8 ల‌క్ష‌లు..
ఓరీ దేవుడో.. సింగిల్ బెడ్‌రూం ఫ్లాట్ అద్దె నెలకు రూ. 8 ల‌క్ష‌లు..
నిరుద్యోగులకు ఇదే మంచి ఛాన్స్.. ప్రభుత్వ సాయంతో రూ.50 వేలు
నిరుద్యోగులకు ఇదే మంచి ఛాన్స్.. ప్రభుత్వ సాయంతో రూ.50 వేలు
గ్రీన్ టీ ఆరోగ్యానికి మేలు చేస్తుందని అతిగా తాగేస్తున్నారా?
గ్రీన్ టీ ఆరోగ్యానికి మేలు చేస్తుందని అతిగా తాగేస్తున్నారా?
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? అసలు కారణం ఇదే కావచ్చు!
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? అసలు కారణం ఇదే కావచ్చు!
చిన్నప్పటి నుంచే నత్తి.. పాన్ ఇండియాను షేక్ చేసిన హీరో..
చిన్నప్పటి నుంచే నత్తి.. పాన్ ఇండియాను షేక్ చేసిన హీరో..
చలితో ఇబ్బందా.. ఈ సింపుల్‌ టిప్స్‌తో శరీరానికి వెచ్చదనం
చలితో ఇబ్బందా.. ఈ సింపుల్‌ టిప్స్‌తో శరీరానికి వెచ్చదనం
ప్రభాస్ జోకర్ గెటప్ వెనకున్నది దర్శకుడు మారుతీ కాదట.!
ప్రభాస్ జోకర్ గెటప్ వెనకున్నది దర్శకుడు మారుతీ కాదట.!
46 ఫ్రీ స్కూల్స్, 26 అనాథాశ్రమాలు కట్టించిన రియల్ హీరో
46 ఫ్రీ స్కూల్స్, 26 అనాథాశ్రమాలు కట్టించిన రియల్ హీరో