Swift New Car: భారత మార్కెట్లోకి స్విఫ్ట్ కొత్త కారు… సరికొత్త లుక్, ఫీచర్లతో ఆకట్టుకుంటోన్న ‘ఫేస్‌లిఫ్ట్’..
Maruti Suzuki Swift Facelift Launched In India: భారత మార్కెట్లో మారుతీ సుజుకి సంస్థకు చెందిన స్విఫ్ట్ కారు.. ఎంతటి క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది కరోనా లాంటి సంక్షోభాన్ని కూడా ఎదుర్కొన్ని ఎక్కువగా అమ్ముడుపోయిన కారుగా..
Maruti Suzuki Swift Facelift Launched In India: భారత మార్కెట్లో మారుతీ సుజుకి సంస్థకు చెందిన స్విఫ్ట్ కారు.. ఎంతటి క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది కరోనా లాంటి సంక్షోభాన్ని కూడా ఎదుర్కొన్ని ఎక్కువగా అమ్ముడుపోయిన కారుగా మారుతి స్విఫ్ట్ రికార్డుల్లోకెక్కింది. ఇదిలా ఉంటే తాజాగా స్విఫ్ట్ తన సరికొత్త కారును విడుదల చేసింది. మారుతీ సుజుకి 2021 ‘స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్’ను తాజాగా ఇండియాలో లాంచ్ చేశారు. ఈ కొత్త కారు లుక్‌తో పాటు, ఫీచర్లతోనూ ఆకట్టుకుంటోంది. ఇక కారుకు ఉన్న ఓ ప్రధాన ఆకర్షణ రెండు రంగుల్లో కనిపించడం. కారు బాడీ కలర్ ఒక రంగులో ఉంటే, రూఫ్ కలర్ మరో రంగులో ఉండడం విశేషం. ఇక ఈ కారు ప్రారంభ ధరను రూ. 5.73 లక్షలుగా (ఢిల్లీ, ఎక్స్‌షోరుమ్)గా నిర్ణయించారు. 2005లో భారత మార్కెట్లోకి వచ్చిన స్విఫ్ట్ ఫీచర్లు, లుక్‌ను మార్చుకుంటూ వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఇక తాజాగా తీసుకొచ్చిన ఫేస్‌లిఫ్ట్ ఇప్పటి వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా రూపొందించినట్లు.. మారుతీ సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ చెప్పుకొచ్చారు. ఈ కారులో వాడిన ఐడిల్ స్టార్ట్ స్టాప్ (ఐఎస్ఎస్) టెక్నాలజీతో ఇంజన్ సామర్థ్యం కూడా పెరగనుంది. ఈ కొత్త స్విఫ్ట్ మూడు డ్యుయల్-టోన్ రంగుల్లో అందుబాటులోకి రానుంది. పర్ట్ ఆర్క్‌టిక్ వైట్ (పర్ల్ మిడ్‌నైట్ బ్లాక్ రూఫ్), సాలిడ్ ఫైర్ రెడ్ (పర్ల్ మిడ్‌నైట్ బ్లాక్ రూఫ్), పర్ల్ మెటాలిక్ మిడ్‌నైట్ బ్లూ (పర్ల ఆర్క్‌టిక్ వైట్ రూఫ్) కలర్స్‌లో స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ అందుబాటులో ఉంటుంది.
Also Read: Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులానికి ఎంత పెరిగిందంటే..