NSE, BSE trading Extended: ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. స్టాక్‌ మార్కెట్ల ట్రేడింగ్‌ టైమ్ పొడిగించారు..

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల ట్రేడింగ్‌ సమయాన్ని పొడిగించారు. సాంకేతిక కారణాల వల్ల నిఫ్టీలో ఉదయం 11:40 గంటల నుంచి ట్రేడింగ్‌ నిలిపివేసిన విషయం తెలిసిందే.

NSE, BSE trading Extended: ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. స్టాక్‌ మార్కెట్ల ట్రేడింగ్‌ టైమ్ పొడిగించారు..
NSE, BSE trading Extended
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 24, 2021 | 4:42 PM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల ట్రేడింగ్‌ సమయాన్ని పొడిగించారు. సాంకేతిక కారణాల వల్ల నిఫ్టీలో ఉదయం 11:40 గంటల నుంచి ట్రేడింగ్‌ నిలిపివేసిన విషయం తెలిసిందే. సమస్య పరిష్కారం కావడంతో సాయంత్రం 3:45 గంటల నుంచి ట్రేడింగ్ తిరిగి ప్రారంభించారు.

నిఫ్టీతో పాటు సెన్సెక్స్‌ సమయాన్ని సైతం సాయంత్రం 5 గంటల వరకు పొడిగించారు. దీంతో నిఫ్టీ ప్రారంభ సెషన్‌ నుంచి ట్రేడింగ్‌ను ఆరంభించింది. సాయంత్రం 4:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ 900 పాయింట్ల లాభంతో 50,095 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 50 పాయింట్లు ఎగబాకి 14,9506 వద్ద ట్రేడవుతోంది.

బ్యాంకింగ్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, ఆర్థికం, పీఎస్‌యూ రంగాల సూచీలు లాభాల్లో పయనిస్తుండడం సూచీలకు జోష్ ఇస్తోంది. ఐటీ, టెక్‌, ఆటో, లోహ రంగ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. కోల్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ, బ్రిటానియా షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. టాటా కన్సల్టెన్సీ, యూపీఎల్‌, గెయిల్‌ ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, శ్రీ సిమెంట్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.