AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC WhatsApp Services: పాలసీదారులకు గుడ్‌న్యూస్‌.. ఎల్‌ఐసీలో వాట్సాప్‌ సేవలు.. ఈ వివరాలు తనిఖీ చేసుకోవచ్చు

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) తన కస్టమర్లకు ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో రకరకాల ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. మొబైల్‌లోనే ఎల్‌ఐసీ..

LIC WhatsApp Services: పాలసీదారులకు గుడ్‌న్యూస్‌..  ఎల్‌ఐసీలో వాట్సాప్‌ సేవలు.. ఈ వివరాలు తనిఖీ చేసుకోవచ్చు
Lic Whatsapp Services
Subhash Goud
|

Updated on: Jan 29, 2023 | 7:02 PM

Share

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) తన కస్టమర్లకు ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో రకరకాల ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. మొబైల్‌లోనే ఎల్‌ఐసీ సర్వీసులను అందించే విధంగా రూపొందిస్తోంది. ఎల్‌ఐసీ ఆన్‌లైన్ పోర్టల్‌లో తమ పాలసీలను నమోదు చేసుకున్న పాలసీదారుల కోసం ఇటీవల తన మొట్టమొదటి వాట్సాప్‌ సేవలను ప్రారంభించింది. ఈ పాలసీదారులు ఎల్‌ఐసీ అధికారిక వాట్సాప్‌ చాట్‌బాక్స్ ద్వారా ప్రీమియం వివరాలు, ULIP ప్లాన్, స్టేట్‌మెంట్లతో పాటు మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు.

ఆన్‌లైన్‌లో తమ పాలసీలను నమోదు చేసుకోని పాలసీదారులు ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లో సేవలను పొందేందుకు ముందుగా నమోదు చేసుకోవాలని ఎల్‌ఐసీ ఒక ప్రకటనలో తెలిపింది. www.licindia.in లో ఎల్‌ఐసీ కస్టమర్ పోర్టల్‌ని సందర్శించడం ద్వారా పాలసీదారులు తమ పాలసీని నమోదు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పోర్టల్‌లో ఎల్‌ఐసి పాలసీ నమోదు చేసిన తర్వాత, వారు ఎల్‌ఐసి వాట్సాప్ సేవలను ఉపయోగించడానికి కొన్ని దశలను ఉపయోగించడం ద్వారా వాట్సాప్‌ సేవలను పొందవచ్చని సంస్థ తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఎల్‌ఐసీ వాట్సాప్‌ సేవలు ఎలా పొందాలో చూద్దాం

  • ముందుగా మీ ఫోన్‌లో ఎల్‌ఐసీ వాట్సాప్‌ నంబర్‌ 8976862090ను సేవ్‌ చేసుకోవాలి.
  • మీ వాట్సాప్‌ని ఓపెన్‌ చేసి, ఆపై ఎల్‌ఐసి వాట్సాప్ చాట్ బాక్స్‌లో సెర్చ్ చేసి ఓపెన్‌ చేయండి.
  • చాట్ బాక్స్‌లో ‘హాయ్’ అని పంపండి.
  • ఎల్‌ఐసీ వెంటనే వాట్సాప్‌లో 11 ఆప్షన్స్‌ పంపుతుంది.
  • సేవల ఎంపిక కోసంచాట్‌లో ప్రత్యుత్తరం ఇవ్వండి.
  • ప్రీమియం తేదీకి ఉదాహరణ 1, బోనస్ సమాచారం కోసం 2 ఇలా ఉంటుంది. అందులో మీకు కావాల్సిన నెంబర్‌ను ఎంపిక చేసుకుని రిప్లై ఇవ్వండి.
  • ఎల్‌ఐసీ వాట్సాప్ చాట్‌లో అవసరమైన వివరాలు వస్తాయి.

ఎల్‌ఐసీ వాట్సాప్‌లో అందుబాటులో ఉన్న సేవల జాబితా:

  • ప్రీమియం బకాయి
  • బోనస్‌ సమాచారం
  • పాలసీ స్థితి
  • లోన్‌ అర్హత
  • రుణ చెల్లింపు కొటేషన్‌
  • రుణ వడ్డీ చెల్లింపు గురించి
  • ప్రీమియం చెల్లించిన సర్టిఫికేట్‌
  • ULIP-యూనిట్ల ప్రకటన
  • ఎల్‌ఐసీ సేవల లింక్స్‌
  • వాట్సాప్‌ సేవలు ప్రారంభించడం/ నిలిపివేయడం గురించి

ఎల్‌ఐసీ ఆన్‌లైన్ పోర్టల్‌లో పాలసీని ఎలా నమోదు చేసుకోవాలి?

  • ముందుగా www.licindia.in ని సందర్శించండి.
  • ఇప్పుడు ‘కస్టమర్ పోర్టల్’ ఎంపికను క్లిక్ చేయండి.
  • మీరు కొత్త వినియోగదారు అయితే, ‘న్యూ కస్టమర్‌’పై క్లిక్ చేసి, అవసరమైన అన్ని వివరాలను నమోదు చేయండి.
  • ఇప్పుడు మీ యూజర్ ఐడి, పాస్‌వర్డ్‌ని ఎంచుకుని, ఆపై మీ వివరాలను సమర్పించండి.
  • ఇప్పుడు మీ యూజర్ ఐడిని ఉపయోగించి ఆన్‌లైన్ పోర్టల్‌కి లాగిన్ చేయండి.
  • తదుపరి ప్రాథమిక సేవలు కింద విధానాలను జోడించడంపై క్లిక్‌ చేయండి.
  • ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ని పూర్తి చేయడానికి మీ అన్ని పాలసీల వివరాలను జోడించండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఈ చిట్కాతో మోకాళ్ళ నొప్పులు పోయి.. వృద్ధాప్యంలో కూడా గుర్రంలా..
ఈ చిట్కాతో మోకాళ్ళ నొప్పులు పోయి.. వృద్ధాప్యంలో కూడా గుర్రంలా..
టీమిండియాలో మోస్ట్ డేంజరస్ ఇతడే.. అడ్డుకోకుంటే సిరీస్ మీకు దక్కదు
టీమిండియాలో మోస్ట్ డేంజరస్ ఇతడే.. అడ్డుకోకుంటే సిరీస్ మీకు దక్కదు
డిసెంబర్ జాతకం.. వీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయం
డిసెంబర్ జాతకం.. వీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయం
టమాటో పచ్చి మిర్చి పచ్చడి ఇలా చేస్తే.. వదలకుండా తింటారు!
టమాటో పచ్చి మిర్చి పచ్చడి ఇలా చేస్తే.. వదలకుండా తింటారు!
అక్టోబర్ చివరి వారం.. ఈ రాశుల వారికి పండుగే పండుగ!
అక్టోబర్ చివరి వారం.. ఈ రాశుల వారికి పండుగే పండుగ!
ఒక ఆధార్ ఐడీతో ఎన్ని సిమ్‌కార్డ్స్‌ తీసుకోవచ్చు..
ఒక ఆధార్ ఐడీతో ఎన్ని సిమ్‌కార్డ్స్‌ తీసుకోవచ్చు..
ఆన్‌లైన్ కంటే కౌంటర్ వెయిటింగ్ టికెట్లు త్వరగా కన్ఫార్మ్ అవుతాయా
ఆన్‌లైన్ కంటే కౌంటర్ వెయిటింగ్ టికెట్లు త్వరగా కన్ఫార్మ్ అవుతాయా
తెలుగు అమ్మాయి శ్రీ చరణి అదుర్స్.. 3 మెయిడిన్లతో 3 వికెట్లు!
తెలుగు అమ్మాయి శ్రీ చరణి అదుర్స్.. 3 మెయిడిన్లతో 3 వికెట్లు!
ఎవర్రా మీరంతా.. స్వీగ్గి పేరుతో వీళ్లు ఏం డెలివరీ చేస్తున్నారో..
ఎవర్రా మీరంతా.. స్వీగ్గి పేరుతో వీళ్లు ఏం డెలివరీ చేస్తున్నారో..
నిత్యా మీనన్‌తోపాటు ఆ క్రేజీ హీరోయిన్ కూడా..
నిత్యా మీనన్‌తోపాటు ఆ క్రేజీ హీరోయిన్ కూడా..